News March 9, 2025
మచిలీపట్నం: రైల్వే ట్రాక్‌పై మృతదేహం

బందరు మండలం బొర్రపోతుపాలెం గ్రామంలో రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొర్రపోతుపాలెంకు చెందిన శివనాగరాజు భార్య కొంతకాలం క్రితం మృతి చెందింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు నాగరాజుపై కేసు పెట్టారు. ఈ మేరకు జైలు నుంచి కొద్ది రోజుల క్రితం బయటకు వచ్చాడు. శనివారం రైల్వే ట్రాక్‌వైపు వెళ్లగా రైలు ఢీకొట్టినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 19, 2025
గన్నవరం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

గన్నవరం మండలం చిన్న అవుటపల్లిలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. చెన్నై కోల్కతా హైవేపై బైక్-కారు ఢీ కొన్నాయి . ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వీరపనేని గూడేనికి చెందిన శ్రీనివాస్ రెడ్డి (55)ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
News March 19, 2025
పెనుగంచిప్రోలు ఉత్సవాలలో జెయింట్ వీల్ ఊడి వ్యక్తి మృతి

పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఉత్సవాలలో జెయింట్ వీల్ ఊడిపడి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు వత్సవాయి మండలం కొత్త వేమవరంకు చెందిన గింజుపల్లి సాయి మణికంఠగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News March 18, 2025
కృష్ణా: లబ్ధిదారుల పురోభివృద్ధికి తోడ్పడండి: కలెక్టర్

లబ్ధిదారులకు విరివిగా రుణాలు అందించి వారి పురోభివృద్ధికి తోడ్పడాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బ్యాంకర్లను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల సమితి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పంట సాగు చేస్తూ సీసీఆర్సీ కార్డులు కలిగిన కౌలు రైతులకు వారి పంట మీద తప్పనిసరిగా రుణాలు అందించాలని సూచించారు.