News March 22, 2025

మచిలీపట్నం విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం

image

మచిలీపట్నంలోని జడ్పీ స్కూల్ విద్యార్థులు టూర్‌‌కి వెళ్లి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో శనివారం ఉదయం ఆగి ఉన్న లారీని వీరి బస్సు ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 11 మంది విద్యార్థులకు స్పల్ప గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Similar News

News March 28, 2025

రైతులను ప్రోత్సహించండి: కలెక్టర్

image

జిల్లాలో అధికంగా వినియోగించే సన్న రకాల వరి పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమైన కలెక్టర్ రానున్న ఖరీఫ్, రబీ సీజన్లలో పండించాల్సిన వరి పంటలపై పలు సూచనలు చేశారు. సన్న రకం వరి వంగడాల సాగుపై రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు.

News March 27, 2025

కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

image

☞ బంటుమిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పల్లెనిద్ర చేసిన ఎస్పీ 
☞ గుడ్లవల్లేరులో విద్యార్థినితో అనుచిత ప్రవర్తన.. టీచర్ సస్పెండ్ 
☞MTM: హత్య కేసును ఛేదించిన పోలీసులు 
☞మోపిదేవిలో రోడ్డు ప్రమాదం.. నలుగురికి గాయాలు 
☞మచిలీపట్నంలో మాజీ కౌన్సిలర్ మృతి 
☞మోపిదేవిలో వివాదం.. కత్తితో దాడి 
☞గుడివాడ: ఫోన్లో కొడాలి నానిని పరామర్శించిన జగన్

News March 27, 2025

గుడివాడ: కొడాలి నానికి గుండె సమస్యలు ఉన్నాయి.!

image

మాజీ మంత్రి కొడాలి నానికి గుండె సమస్యలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. కొన్ని రోజులుగా వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు 3 వాల్స్ బ్లాక్‌ అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన ఆపరేషన్‌ కూడా చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారని వైసీపీ నేత దుక్కిపాటి శశి భూషణ్ తెలియజేశారు. 

error: Content is protected !!