News November 11, 2024
మచిలీపట్నం : సముద్ర స్నానాల ఏర్పాట్ల పరిశీలన

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 15వ తేదీన మంగినపూడి బీచ్ వద్ద జరిగే సముద్ర స్నానాలకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు. సముద్ర పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన పడవలు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు.
Similar News
News November 16, 2025
మీకోసంను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. సోమవారం కలెక్టరేట్లో మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే తగు విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు.
News November 16, 2025
కృష్ణా: సోషల్ మీడియా పోస్టుపై స్పందించిన పోలీసులు

కృష్ణా జిల్లా పెడనలో జరగనున్న పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం వ్యాపార సముదాయాల బహిరంగ వేలం పాటల నిర్వహణ జరిగింది. ఆ వేలం పాటకు హాజరైన పలువురి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, “మొన్న ఢిల్లీలో జరిగింది.. నేడు గల్లీలో జరుగుతోంది” అంటూ వ్యాఖ్యానించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News November 16, 2025
కృష్ణా జిల్లాలో ‘దాళ్వా’ సాగుపై సందిగ్ధత.!

కృష్ణా జిల్లాలో దాళ్వా సాగుపై సందిగ్ధత నెలకొంది. రెండవ పంటగా దాళ్వాకు సాగునీరు ఇవ్వాలని రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. కానీ జలాశయాల్లో నీటి నిల్వలు అంతంత మాత్రంగా ఉండటం వల్ల దాళ్వాకు సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. దాళ్వాకు ప్రత్యామ్నాయంగా అపరాల సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం లోపాయికారిగా రైతులకు ఇదే చెబుతుండటం విశేషం.


