News November 11, 2024
మచిలీపట్నం : సముద్ర స్నానాల ఏర్పాట్ల పరిశీలన
కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ నెల 15వ తేదీన మంగినపూడి బీచ్ వద్ద జరిగే సముద్ర స్నానాలకు సంబంధించిన ఏర్పాట్లను సోమవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, జిల్లా ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు. సముద్ర పుణ్యస్నానాలు ఆచరించే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన పడవలు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు.
Similar News
News December 5, 2024
కృష్ణా: RWS అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
జిల్లాలో RWS అధికారుల పనితీరుపై కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో RWS ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులపై బుధవారం ఆయన సమీక్షించారు. RWS అధికారులు చేపట్టిన పనుల్లో 25% కూడా పూర్తి కాకపోవడం పట్ల కలెక్టర్ సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
News December 5, 2024
కృష్ణా: స్పెషల్ రైళ్లను పొడిగించిన రైల్వే అధికారులు
విజయవాడ మీదుగా విశాఖపట్నం(VSKP)-చెన్నై ఎగ్మోర్(MS) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.08557 VSKP-MS రైలును DEC 7 నుంచి 2025 MARCH 1 వరకు ప్రతి శనివారం, నం.08558 MS-VSKP మధ్య నడిచే రైలును DEC 8 నుంచి 2025 MARCH 2 వరకు ప్రతి శనివారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు తదితర స్టేషన్లలో ఆగుతాయన్నారు.
News December 5, 2024
RWS అధికారులకు కీలక ఆదేశాలిచ్చిన కలెక్టర్
కృష్ణా జిల్లా కలెక్టర్ DK బాలాజీ బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా(RWS) అధికారులతో సమావేశమయ్యారు. ఇందులో ఆయన మండలాలవారీగా తాగునీటి పథకాల మరమ్మతు పనులు, అంగన్వాడీ టాయిలెట్ల నిర్మాణాలు, మరమ్మతు పనుల గురించి సమీక్షించారు. CSR, ఎంపీ ల్యాడ్స్, జిల్లా మినరల్ ఫండ్స్‌తో ఈ పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని RWS అధికారులకు కలెక్టర్ DK బాలాజీ ఆదేశాలిచ్చారు.