News March 12, 2025
మచిలీపట్నం: సిమెంట్ ఫ్యాక్టరీకి ప్లాస్టిక్ వ్యర్ధాలు: కలెక్టర్

కృష్ణా జిల్లాలో ప్లాస్టిక్ వాడకం నియంత్రించడానికి పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలు, వ్యాపారస్తుల నుంచి ప్లాస్టిక్ కప్పులు, కవర్లు, గ్లాసులు ఒకచోట పోగుచేసి వాటిని పంచాయతీ వాహనాల ద్వారా సిమెంట్ ఫ్యాక్టరీకి తరలించాలన్నారు.
Similar News
News April 19, 2026
కృష్ణా: Way2Newsలో ఉద్యోగ అవకాశాలు

కృష్ణా జిల్లాలో మండలాల వారీగా Way2Newsలో పని చేయడానికి రిపోర్టర్‌లు కావలెను. అర్హత: ఏదైనా ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన, చేసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఆసక్తి గల వారు <
News April 19, 2026
కృష్ణా: రేపు కలెక్టరేట్‌లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్

జిల్లాలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి గాను ఈ నెల 20వ తేదీన కలెక్టరేట్‌లో ఎంప్లాయిస్ గ్రీవెన్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ మీటింగ్ హాలులో ప్రారంభమయ్యే గ్రీవెన్స్‌లో ఉద్యోగుల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News April 19, 2026
మచిలీపట్నంలో నేడు బంగారం ధర ఎంతంటే!

అక్షయ తృతీయ కావడంతో జిల్లా కేంద్రంమైన మచిలీపట్నంలోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. మచిలీపట్నంలో ఆదివారం గ్రాము బంగారం రూ. 15,078 పలుకుతోంది. 10 గ్రాములు రూ. 1,50,780 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ.280గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.


