News August 27, 2024

మచిలీపట్నం: 12 మంది స్టాఫ్ నర్సులను విధుల నుంచి తొలగింపు

image

మచిలీపట్నం సర్వజనాసుపత్రిలో 12 మంది స్టాఫ్ నర్సులను అధికారులు విధుల నుంచి తొలగించారు. కొవిడ్ సమయంలో తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు పొందినట్లు దర్యాప్తులో తేలడంతో తొలగించినట్లు తాజాగా సమాచారం వెలువడింది. కాగా నర్సుల నియామకంపై ఆరోపణలు రావడంతో రాజమండ్రి హెల్త్ రీజినల్ డైరెక్టర్ దర్యాప్తుకు ఆదేశించారు. అక్రమ మార్గంలో ఉద్యోగాలు పొందిన 12 మందిని విధుల నుంచి తొలగించారు.

Similar News

News September 19, 2024

కృష్ణా: 100 రోజుల పాలనపై మీ కామెంట్.?

image

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రేపటితో 100 రోజులు పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ఈ నెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్నక్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని YCP విమర్శిస్తోంది. 100 రోజుల పాలన, మీ ఎమ్మెల్యే పనితీరుపై మీ కామెంట్..

News September 19, 2024

నేడు విజయవాడలో పవన్‌ను కలవనున్న బాలినేని

image

వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా గురువారం ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీకానున్నారు. ఈ మేరకు గురువారం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్‌తో చర్చలు అనంతరం ఆయన జనసేన పార్టీలో చేరనున్నారని తెలుస్తోంది.

News September 18, 2024

కృష్ణా: ఇసుక బుకింగ్‌పై సిబ్బందికి శిక్షణ

image

ఇసుక Online బుకింగ్ విధానంపై గ్రామ / వార్డు సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ విధానం అమలు చేయనున్నదని, ఇందుకు సంబంధించి పోర్టల్‌ను రేపు ప్రారంభిస్తారన్నారు.