News June 4, 2024

మచిలీపట్నం: 2,16,938 ఓట్ల మెజార్టీతో బాలశౌరి విజయం

image

మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ (వైసీపీ)పై 2,16,938 ఓట్ల మెజార్టీ సాధించారు. బాలశౌరికి 7,12,149 ఓట్లు రాగా సింహాద్రి చంద్రశేఖర్ కు 4,95,211 ఓట్లు వచ్చాయి.

Similar News

News November 29, 2024

వందే భార‌త్ రైలులో ప్ర‌యాణించిన మంత్రులు 

image

తిరుప‌తి నుంచి విజ‌య‌వాడ‌కు వందే భార‌త్ రైలులో గురువారం ఏపీ మంత్రులు ప్ర‌యాణించారు. నారావారి ప‌ల్లెలో నారా రామ్మూర్తి నాయుడు పెదక‌ర్మ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్ర‌లు అనంత‌రం తిరిగి ప్ర‌యాణ‌మ‌య్యారు. మంత్రులు కొల్లు ర‌వీంద్ర‌, వంగ‌ల‌పూడి అనిత, ఎమ్మెల్యే యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు ఈ ప్ర‌యాణంలో ఉన్నారు. ఈ మేర‌కు వారు ఆ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

News November 29, 2024

వైసీపీ నేత కోసం పోలీసుల గాలింపు 

image

గండూరి ఉమామహేశ్వరరావు ఫిర్యాదు మేరకు పోలీసులు వైసీపీ నేత గౌతమ్ రెడ్డితో పాటు మరికొందరి అనుచరులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా అనుమానిస్తున్న మాజీ ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డిపై డిసెంబర్ రెండో తేదీ వరకు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని కోర్టు తెలిపింది. ఈ ఘటనపై విజయవాడ రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.

News November 28, 2024

కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో నాలుగేళ్ల బీఎస్సీ బయోమెడికల్ కోర్సు విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. డిసెంబర్ 10,11,12,13,16,17 తేదీలలో మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టులవారీగా టైం టేబుల్ వివరాలకై https://www.nagarjunauniversity.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని విద్యార్థులను కోరింది.