News June 4, 2024

మచిలీపట్నం: 40 వేల మెజారిటీతో దూసుకెళ్తున్న బాలశౌరి

image

మచిలీపట్నం పార్లమెంట్ స్థానంలో NDA కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి ప్రస్తుతం 41,574 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌ రౌండ్లలో బాలశౌరి 1,32,678 ఓట్లు సాధించగా ఆయన ప్రత్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ 91,104 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లు కృష్ణ ఇప్పటి వరకు 6,895 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు.

Similar News

News October 27, 2025

దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయండి: కలెక్టర్

image

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్ డీకే బాలాజీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 27, 28, 29 తేదీల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్న దృష్ట్యా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించాలన్నారు.

News October 26, 2025

కృష్ణా: తుఫాన్‌ ప్రభావంపై డీపీఓ హెచ్చరిక

image

తుఫాన్‌ ప్రభావంతో రాబోయే మూడు రోజులు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీఓ) జె.అరుణ సూచించారు. మట్టి మిద్దెలు, కల్వర్టులు, పూరి గుడిసెలు, రోడ్డు పక్కన గుడారాల్లో నివసించేవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సచివాలయ ఉద్యోగులు, వీఆర్‌ఓలు, కార్యదర్శులు, ఇతర సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

News October 26, 2025

కృష్ణా: జిల్లాలో మండల ప్రత్యేక అధికారుల నియామకం

image

మొంథా తుపాన్ పరిస్థితులను అంచనా వేసేందుకు గాను జిల్లాలోని 25 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. మండల స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుని సజావుగా తుపాన్ ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.