News October 18, 2024

మచిలీపట్నం GGH నిర్వహణలో మార్పు రావాలి: మంత్రి కొల్లు రవీంద్ర

image

మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణలో మార్పు కనపడాలని మంత్రి కొల్లు రవీంద్ర వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం మంత్రివర్యులు నగరంలోని తన నివాసంలో ప్రభుత్వ సర్వజన ప్రభుత్వాస్పత్రి, వైద్య కళాశాల పనితీరుపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి లోపల, బయట అధ్వాన్నంగా ఉన్న పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చాలన్నారు.

Similar News

News May 7, 2025

కృష్ణా: మే 11న ఆదర్శ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు 

image

PM సూర్యఘర్ పథకం మంజూరు కోసం జిల్లాలో ఎంపిక చేసిన తొమ్మిది ఆదర్శ గ్రామాల్లో మే 11వ తేదీన ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు సంసిద్ధం కావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో CPDCL ఆధ్వర్యంలో PM సూర్య ఘర్ పథకంపై అధికారులు, బ్యాంకర్లకు ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించి పలు సూచనలు చేశారు. 

News May 7, 2025

పాకిస్తాన్ వ్యక్తులు భారత్ వదిలిపెట్టి వెళ్లాలి: ఎస్పీ

image

కృష్ణా జిల్లాలో పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారు తప్పకుండా 27వ తేదీలోపు భారత్‌ను విడిపోవాల్సి ఉంటుందని ఎస్పీ ఆర్. గంగాధర్ రావు పేర్కొన్నారు. ఈ నియమాన్ని పాటించని వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అటువంటి వ్యక్తులు వెంటనే తమ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్‌లకు తెలియజేసి, దేశం విడిచి వెళ్లాలన్నారు. 

News May 7, 2025

గ్రామాభివృద్ధిపై డీపీఆర్ తయారు చేయండి: కలెక్టర్

image

కూచిపూడి గ్రామాన్ని రాష్ట్ర వారసత్వ సంపద గల ప్రాంతంగా అభివృద్ధి చేయుటకు సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR)ను వారం రోజుల లోపు తయారు చేసి అందజేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కూచిపూడి ప్రాంత అభివృద్ధి పనులపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.