News November 29, 2024

మచ్చిలీపట్నం: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

image

బందరు మండలం సుల్తానగరంలో సీతారామాంజనేయ రైస్ మిల్లును కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎంత మేర ధాన్యం కొనుగోలు చేశారో మిల్లు యజమానిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. 

Similar News

News November 13, 2025

గన్నవరం: జాతీయ రహదారిపై ప్రమాదం.. స్పాట్ డెడ్.!

image

గన్నవరం (M)కేసరపల్లి వద్ద జాతీయ రహదారిపై బుధవారం ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం బైకును వెనుక నుంచి ఢీకొట్టడంతో, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సంతోష్ (31)అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ గూడవల్లి చైతన్య కళాశాల హాస్టల్‌లో వంట మాస్టర్‌లుగా పనిచేసేవారిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గన్నవరం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News November 13, 2025

ప్రతిష్టాత్మక కమిటీలో మచిలీపట్నం ఎంపీకి స్థానం

image

మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి మరో ప్రతిష్టాత్మక కమిటీలో చోటు దక్కింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు-2025 జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వం (సవరణ) బిల్లు సంయుక్త కమిటీ సభ్యులుగా బాలశౌరిని నియమించారు. ప్రతిష్టాత్మకమైన కమిటీలో చోటు దక్కినందుకు ఎంపీ బాలశౌరి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలియజేశారు.

News November 12, 2025

పేదలందరికీ సొంతింటి కల నిజం చేయాలి: కలెక్టర్

image

మచిలీపట్నంలో పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చాలని కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. చింతగుంటపాలెంలో పీఎంఏవై 1.0 పథక గృహాలను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం పీఎంఏవై 2.0 గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లాలో 6,708 గృహాలు, మచిలీపట్నం నియోజకవర్గంలో 1,101 గృహాలు పూర్తయ్యాయని తెలిపారు. కొత్త లబ్ధిదారులు నవంబర్ చివరి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.