News November 29, 2024

మచ్చిలీపట్నం: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

image

బందరు మండలం సుల్తానగరంలో సీతారామాంజనేయ రైస్ మిల్లును కలెక్టర్ డీకే బాలాజీ శుక్రవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇప్పటి వరకు ఎంత మేర ధాన్యం కొనుగోలు చేశారో మిల్లు యజమానిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు. 

Similar News

News January 23, 2026

కృష్ణా: ఈ శాఖలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

image

నిరుద్యోగ యువతకు భారతీయ పోస్టల్ శాఖ శుభవార్త తెలిపింది. దేశ వ్యాప్తంగా గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి 28,740 ఉద్యోగాలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌కు 1,215 పోస్టులు కేటాయించగా, మచిలీపట్నం డివిజన్ పరిధిలో 27 ఉద్యోగాలు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా, 10వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక జరగనుంది. దరఖాస్తులు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు స్వీకరించనున్నారు.

News January 22, 2026

EVM గోడౌన్ భద్రతలో అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ ఆదేశించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలోని EVM గోడౌన్‌ను ఆయన తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద ఉన్న భద్రతా చర్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భద్రతా చర్యలు విషయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.

News January 22, 2026

కృష్ణా: 23న జిల్లాలో ‘నా ఇండియా నా ఓటు’

image

కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 23వ తేదీన జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో ‘నా ఇండియా నా ఓటు’ అనే నినాదంతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని ఆయన సూచించారు.