News February 17, 2025

మటన్ షాపులకు ఎగబడ్డ జనం.. విపరీతంగా పెరిగిన రేట్లు!

image

బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ విక్రయాలు అమాంతం పడిపోగా మటన్, రొయ్యలు, చేపల విక్రయాలు విపరీతంగా పెరిగాయి. ఏలూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కేజీ మటన్ గరిష్ఠంగా రూ.1200 వరకు విక్రయించినట్లు తెలుస్తోంది. చేపలు కేజీ సాధారణంగా రూ.130గా ఉంటే రూ.180కి, రొయ్యలు రూ.250గా ఉంటే రూ.350కి పెంచి అమ్మారు. ధర ఎక్కువయినప్పటికీ బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు వీటి కొనుగోళ్లకే మొగ్గు చూపారు. చికెన్ షాపులు వెలవెలబోయాయి.

Similar News

News November 21, 2025

మాజీ మంత్రి శైలజానాథ్‌కు మాతృవియోగం

image

శింగనమల వైసీపీ ఇన్‌ఛార్జి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ తల్లి సాకే గంగమ్మ మృతి చెందారు. అనంతపురంలోని రామకృష్ణ నగర్‌లో నివాసం ఉంటున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో శైలజానాథ్ కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు శైలజానాథ్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

News November 21, 2025

నెల్లూరులో చేపల సాగుకు ప్రాధాన్యత

image

రొయ్యలకంటే చేపల సాగుకే నెల్లూరులో ప్రాధాన్యత పెరుగుతోంది. తక్కువ ఖర్చులు, స్థిరమైన చరల కారణంగా చేపల పెంపకం ఏటా విస్తరిస్తోంది. జిల్లాలో 5 వేల ఎకరాల్లో గెండి, బొచ్చ, మోసు, రూప్‌చంద్ చేపలు ప్రధానంగా సాగు అవుతున్నాయి. సంవత్సరానికి సగటుగా 1.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తోంది. ఇందులో గెండి 10%, బొచ్చ 35%, మోసు 3% ఉత్పత్తి. చేపలను తమిళనాడు, కర్ణాటక, కేరళ, ప.బెంగాల్‌కి ఎగుమతి చేస్తున్నారు.

News November 21, 2025

HYD: చేవెళ్ల హైవేపై మరో ఘోర ప్రమాదం

image

చేవెళ్ల ట్రాఫిక్ PS పరిధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. స్థానికుల వివరాలిలా.. మొయినాబాద్‌లోని తాజ్ సర్కిల్ సమీపంలో కనకమామిడి వెళ్లే రూట్లో 2 కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.