News August 6, 2024
మట్టి మిద్దె కూలిన ఘటన.. రూ.10 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే
చాగలమర్రి మండలం చిన్న వంగలిలో మట్టి మిద్దె కూలి మరణించిన కుటుంబాన్ని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పరామర్శించారు. ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కును అందజేశారు. తల్లిదండ్రుల మరణంతో అనాథ అయిన బాలిక ప్రసన్నకు తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. అక్కలా చూసుకుంటానని ధైర్యం చెప్పారు. ప్రసన్న చదువుపై మంత్రి నారా లోకేశ్‌తో చర్చిస్తానని చెప్పారు. అలాగే బాలిక బాగోగులు చూసుకునే నాయనమ్మకు రూ.2 లక్షలు అందజేశారు.
Similar News
News September 11, 2024
కర్నూలు: మాజీ మంత్రి కొడాలి నానిపై పోలీసులకు ఫిర్యాదు
అసభ్య పదజాలంతో దూషించిన మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టీడీపీ లీగల్ సెల్ ఆలూరు నియోజకవర్గ కన్వీనర్ ప్రవీణ్ కుమార్, టీడీపీ నాయకుడు వెంకటేశ్ చౌదరి మంగళవారం ఆలూరు సీఐ శ్రీనివాస్ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. విజయవాడ వరద బాధితులకు మంచి చేస్తున్న సీఎంపై లోఫర్ అంటూ అసభ్య పదజాలంతో దూషించడం మాధ్యమాల్లో చూశామన్నారు. నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
News September 11, 2024
కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయాలి: కలెక్టర్
కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ది శాఖ అమలు చేస్తున్న పథకాలు జిల్లాలో సక్రమంగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. పనుల పురోగతిపై ఎంపీ శబరికి నివేదిక రూపంలో అందజేసి కేంద్రం ద్వారా పెండింగ్ నిధులు రాబట్టేందుకు సహకరించాలన్నారు.
News September 11, 2024
సోదర భావంతో పండుగలను జరుపుకోవాలి: ఎస్పీ
జిల్లా పోలీసు కార్యాలయంలోలో ఈ నెల 15న వినాయక నిమజ్జనం, 16న మిలాద్ ఉన్ నబీ పండుగలను పురస్కరించుకుని శాంతియుత సమావేశం మంగళవారం నిర్వహించారు. కర్నూలులోని వివిధ వర్గాలకు చెందిన సామాజిక మత పెద్దలు, జిల్లాస్థాయి అధికారులతో ఎస్పీ మాట్లాడారు. జిల్లా మతసామరస్యంలో ఆదర్శంగా, స్పూర్తిగా ఉండాలన్నారు. వినాయక నిమజ్జన ఉత్సవం ప్రశాంతంగా జరుగుతుందన్నారు. కుల, మతాలకు అతీతంగా కలిసి మెలిసి పండుగలు జరుపుకోవాలన్నారు.