News September 6, 2024

మట్టి విగ్రహాలను ప్రోత్సహించండి: కడప కలెక్టర్

image

సహజ రంగులతో తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడదామని, కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రజలకు సూచించారు. వినాయక చవితి విశిష్టతను కాపాడేందుకు ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేయడం వల్ల గొప్ప మార్పులు సాధించవచ్చని ఆయన ప్రజలను కోరారు. చెరువులు జల వనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగం తగ్గిద్దామని, మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దామని పిలుపునిచ్చారు.

Similar News

News September 29, 2024

కలసపాడు: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

image

మండలంలోని ఎగువ రామాపురానికి చెందిన బీటెక్ విద్యార్థి తమిళనాడు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అన్నదమ్ములు ఇద్దరు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొనడంతో తమ్ముడు అర్జున్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. అన్న అరవింద రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 29, 2024

రాజంపేట: బంగారు నగలు చోరీ

image

రాజంపేట పట్టణంలోని శ్రీకృష్ణదేవ రాయలు నగర్‌లో నివాసం ఉండే రవి ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు బద్దలు కొట్టి 70 గ్రాములు బంగారు నగలు చోరీ చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను సీఐ ఎల్లమ రాజు, ఎస్సై ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. అయితే జిల్లాలో వారం రోజుల్లో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

News September 29, 2024

ముద్దనూరు వద్ద అదుపుతప్పి లారీ బోల్తా

image

కడప జిల్లా ముద్దనూరు మండలంలోని నల్లబల్లె రహదారిపై ఆదివారం తెళ్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ముద్దనూరు నుంచి తాడిపత్రి బైపాస్ పనుల కొరకు కంకర లోడ్‌తో వెళ్తున్న ఓ టిప్పర్ ఉదయం 2.30 సమయంలో అదుపు తప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఒకేసారి పదుల సంఖ్యలో టిప్పర్లు వెళ్తుండగా వెనక టిప్పర్​కు దారిచ్చే ప్రయత్నంలో ప్రమాదం జరిగిందన్నారు.