News February 5, 2025
మట్టెవాడ క్రైం కానిస్టేబుల్‌కు ప్రశంసాపత్రం అందజేత

రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ జరిగిన దొంగతనాలను విశ్లేషించి చోరీలకు పాల్పడిన దొంగల వివరాలను సంబంధిత జిల్లాల పోలీస్ అధికారులకు సమాచారం అందిస్తున్న మట్టెవాడ క్రైం కానిస్టేబుల్ అలీకి వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ప్రశంసా పత్రం అందించారు. కేరళలోని తిరువనంతపురం, కొచ్చికి చెందిన పోలీస్ కమిషనర్లతో పాటు వికారాబాద్ ఎస్పీ అలీని అభినందిస్తూ తెలుపుతూ జారీ చేసిన ప్రశంసాపత్రాలను సీపీ అందజేశారు.
Similar News
News February 19, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా నేరా వార్తల వివరాలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా నేల వార్తలు వివరాలు..కారు ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు@హరితహారం చెట్లు నరికివేత..మాజీ ఎంపీపీ ఆగ్రహం@ఎల్లారెడ్డిపేట మడేలేశ్వర స్వామి ఆలయ మెట్లు ధ్వంసం@ఇసుక డంపును సీజ్ చేసిన తంగళ్లపల్లి ఎమ్మార్వో జయంత్ కుమార్@రాచర్ల బొప్పాపురం గ్రామంలో ఓ వ్యక్తి సూసైడ్: ఎస్ఐ రమాకాంత్
News February 19, 2025
జిల్లా కలెక్టర్లతో ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్

జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీరు, సాగునీరు, రైతు భరోసా తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణిలు పాల్గొన్నారు. జిల్లాలోని 75 ప్రభుత్వ సంక్షేమ శాఖల గురుకులాలు, వసతి గృహాలలో వినూత్నంగా విద్యార్థులకు డార్మిటరీలు ఫిర్యాదుల పెట్టే తీసుకొచ్చి చలికాలంలో వేడి నీరు అందించడం పై చర్చించారు.
News February 18, 2025
కరీంనగర్: లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికీ 11 ఏళ్లు..

లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొంది నేటికీ 11 ఏళ్లు అయింది. 2014 ఫిబ్రవరి 18 ఇదే రోజున లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదించిన రోజు అని ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ గుర్తుచేశారు. కేసీఆర్ లాంటి దార్శనికత కలిగిన నాయకుడి నాయకత్వంలో ప్రజాఉద్యమంలో విజయం సాధించిన రోజు అని కొనియాడారు. పట్టుదల, నిబద్ధత ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని కేసీఆర్ నిరూపించిన రోజు అని తెలిపారు.