News February 5, 2025
మట్టెవాడ క్రైం కానిస్టేబుల్‌కు ప్రశంసాపత్రం అందజేత

రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ జరిగిన దొంగతనాలను విశ్లేషించి చోరీలకు పాల్పడిన దొంగల వివరాలను సంబంధిత జిల్లాల పోలీస్ అధికారులకు సమాచారం అందిస్తున్న మట్టెవాడ క్రైం కానిస్టేబుల్ అలీకి వరంగల్ సీపీ అంబర్ కిశోర్ ప్రశంసా పత్రం అందించారు. కేరళలోని తిరువనంతపురం, కొచ్చికి చెందిన పోలీస్ కమిషనర్లతో పాటు వికారాబాద్ ఎస్పీ అలీని అభినందిస్తూ తెలుపుతూ జారీ చేసిన ప్రశంసాపత్రాలను సీపీ అందజేశారు.
Similar News
News January 22, 2026
డేంజర్.. మత్తులో ‘చిత్తూ’రు.!

ఉమ్మడి చిత్తూరు జిల్లా మత్తుకు చిత్తవుతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా విచ్చలవిడి గంజా వాడకంతో పలుచోట్ల పరిస్థితులు అదుపు తప్పుతున్నాయట. GDనెల్లూరులో అమ్మాయిలను వేధించిన <<18919101>>ఘటన<<>>, చంద్రగిరిలో రౌడీ షీటర్ల <<18912584>>వీరంగం<<>> ఇందుకు నిదర్శనాలు. చిత్తూరులో స్కూల్లోనే నిషేధిత మత్తుపదార్థాలు వాడుతున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. స్థానిక నేతల అండతో ఈ ముఠా ఏకంగా పోలీసులనే బెదిరిస్తున్నారట.
News January 22, 2026
సరస్వతీ దేవి అనుగ్రహం కోసం రేపేం చేయాలంటే

అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు పసుపు దుస్తులు ధరించాలి. పూజలో తెల్లని పూలు, గంధం సమర్పించి ‘ఓం ఐం సరస్వత్యై నమః’ మంత్రాన్ని జపించాలి. నైవేద్యంగా చక్కెర పొంగలి, కేసరి, పులిహోరను సమర్పించాలి. పేద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు దానం చేయడం వల్ల అమ్మవారు ప్రసన్నులవుతారు. పూజా సమయంలో పుస్తకాలను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రార్థించడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని పురాణ వచనం.
News January 22, 2026
పాజిటివ్ థింకింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే?

ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వెంబడిస్తుంటే, అందుకు రివర్స్‌లో.. ‘అలా జరగదు.. ఇలా జరుగుతుంది.. అలా కాదు.. ఇలా అవుతుంది’ అని మనసులోనే మాటలు అల్లుకోవాలి. కృతజ్ఞతా భావాన్ని పెంచాలి. ఒక మనిషితో ఎలా మాట్లాడతామో, మనసుతో కూడా అలానే మాట్లాడుకోగలగాలి. ఆ చర్చ, ఆ ఆలోచన పరిష్కారం దిశగా ఉండాలి. నిద్రలేచిన వెంటనే మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలి. ఏ చిన్న విజయాన్నైనా సెలబ్రేట్ చేసుకోండి.


