News March 31, 2025
మడకశిరలో పర్యటించిన సత్యసాయి జిల్లా ఎస్పీ

మడకశిర పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోగా, శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆదివారం జిల్లా ఎస్పీ ఆత్మహత్య చేసుకున్న గృహాన్ని పరిశీలించి అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
Similar News
News April 3, 2025
డేటింగ్, పెళ్లిపై ఆర్జే మహవాష్ కీలక వ్యాఖ్యలు

పెళ్లి, డేటింగ్ విషయాలపై క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ ఆర్జే మహవాష్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ‘నేను సింగిలే కానీ, సంతోషంగా ఉన్నా. పెళ్లి చేసుకోవడానికి మాత్రమే డేటింగ్ చేస్తా. క్యాజువల్‌గా డేట్స్‌కి వెళ్లను. ప్రస్తుతం నేను వివాహం అనే భావనను అర్థం చేసుకోవడం మానేశా. అందుకే, నేను డేటింగ్ చేయడం లేదు. నేను వాటన్నింటినీ ఆపేశా’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె చెప్పుకొచ్చారు.
News April 3, 2025
భవన నిర్మాణ కార్మికులకు తంబు రద్దు చేయాలి: AITUC

భవన నిర్మాణ కార్మికులకు తంబు విధానాన్ని రద్దు చేసి, నిర్మాణ రంగంలో పనిచేస్తూ 60 సంవత్సరాలు దాటిన కార్మికులకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని(AITUC) తెలంగాణ రాష్ట్ర బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారగోని ప్రవీణ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేటలోని శ్రామిక భవన్‌లో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం 2వ మహాసభలో పాల్గొని మాట్లాడారు.
News April 3, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యంశాలు.!

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు.➤కొత్త జంటకు YS జగన్ ఆశీర్వాదం➤కమిటీల్లో అన్ని వర్గాలకు చోటు: YCPనేతలు➤బ్యాడిగ మార్కెట్లో వర్షం.. తడిసిన మిరప➤ కర్నూలు: పిడుగు పాటుతో బాలుడి మృతి➤ నంది అవార్డు గ్రహీతకు సబ్ కలెక్టర్ అభినందన➤ భూములను కబ్జా చేయడానికి వక్ఫ్ సవరణ: మాజీ MLA హఫీజ్➤ కర్నూలు: నాయకులతో జగన్ సెల్ఫీ.!➤ జిల్లాలో దంచికొట్టిన వర్షాలు➤కౌతాళంలో సబ్ కలెక్టర్ పర్యటన.