News January 22, 2025

మడకశిరలో ₹2400 కోట్ల పెట్టుబడి!

image

భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బి.కళ్యాణిని దావోస్‌లోమంత్రి నారా లోకేశ్ కలిశారు. రక్షణ తయారీ ప్రాజెక్టు గురించి చర్చించారు. మడకశిర నియోజకవర్గం ముర్దనహళ్లిలో 1000 ఎకరాల్లో ₹2400 కోట్లతో రక్షణ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కళ్యాణి తెలిపారు. ఈ సందర్భంగా సాధ్యమైనంత త్వరగా పనులు ప్రారంభించాలని మంత్రి లోకేశ్ ఆయనను కోరారు.

Similar News

News October 17, 2025

క్రాకర్స్ దుకాణాలకు అనుమతులు తప్పనిసరి: ఎస్పీ జగదీశ్

image

క్రాకర్స్ విక్రయలకు అనుమతులు తప్పనిసరని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ తెలిపారు. లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి షాపులో అగ్నిమాపక పరికరాలు ఉండాలని, షాపుల మధ్య దూరం పాటించాలని తెలిపారు. షెడ్లు ప్రమాదకరంగా ఉండకూడదన్నారు. విద్యుత్ సరఫరా భద్రంగా ఉండేలా సర్టిఫైడ్ ఎలక్ట్రిషన్‌తో పనిచేయాలని సూచించారు.

News October 17, 2025

వైసీపీని బలోపేతం చేయడానికి కమిటీల నియామకం: అనంత వెంకటరామిరెడ్డి

image

వైసీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి డివిజన్ స్థాయిలో కమిటీల నియామకం చేపడుతున్నట్లు వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గురువారం అనంతపురం నగరంలోని కోర్టు రోడ్డులోని తన క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు, వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. కమిటీల నియామకం, ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణపై అనంత దిశా నిర్దేశం చేశారు.

News October 15, 2025

పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయాలి: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. భావితరాలకు మన దేశ వారసత్వం, పురాతన కట్టడాల గురించి తెలపాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తు చేశారు.