News March 30, 2024
మడకశిర: ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

మడకశిర పట్టణం ఎగువ అచ్చంపల్లి గ్రామ సమీపంలో సోమశేఖర్(45) అనే వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్‌ఐ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. పట్టణానికి చెందిన సోమశేఖర్ తాగుడుకు బానిసై, కుటుంబ పోషణ భారమై, జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు. భార్య సుబ్బలక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
Similar News
News February 12, 2026
మాజీ సీఎంసంజీవయ్య జన్మదిన వేడుకలను జయప్రదం చేయండి: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 14న ఏపీ తొలి దళిత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 14న ఉదయం 10:30 గంటలకు రెవెన్యూ భవన్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలకు జిల్లా అధికారులు, దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం కలెక్టర్ పిలుపునిచ్చారు.
News February 12, 2026
ATP: ఉత్సవాల నిర్వహణపై అధికారుల సమీక్ష

అనంతపురం జిల్లాలో బ్రహ్మోత్సవాలు, జాతరలు, శివరాత్రి పర్వదినాల సందర్భంగా పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద బ్యారికేడింగ్, సీసీ కెమెరాలు, తాగునీరు, శానిటేషన్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అగ్నిమాపక, అంబులెన్స్ వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. సమన్వయంతో పనిచేస్తూ సెక్యూరిటీ ఆడిట్ నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
News February 12, 2026
రెవెన్యూ అర్జీలపై వేగం పెంచాలి: జేసీ

అనంతపురం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ విష్ణుచరణ్ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్ అర్జీలను వెంటనే క్లియర్ చేయాలని, మ్యుటేషన్ దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల వారీగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్, మీ సేవా సేవలను వేగవంతం చేయాలన్నారు. రీసర్వే ఫేజ్-1, 2, 3 గ్రామాల్లో పనులు పూర్తి చేయాలన్నారు.


