News February 13, 2025

మడకశిర సీఐ రామయ్య సస్పెండ్ 

image

మడకశిర అప్ గ్రేడ్ సీఐగా పని చేస్తున్న రాగిరి రామయ్యను సస్పెండ్ చేస్తూ గురువారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని జిల్లా ఎస్పీ రత్నకు ఇటీవల ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ఎస్పీ వెంటనే విచారణకు ఆదేశించి ఆయనను వీఆర్‌కి పంపారు. మహిళ ఆరోపణలపై విచారణ జరిపిన అనంతరం సీఐని నేడు సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News November 24, 2025

విశాఖ: ప్రియరాలితో వాగ్వాదం.. ప్రియుడి ఆత్మహత్య

image

గాజువాక సమీపంలోని తుంగ్లం పక్కన చుక్కవానిపాలెంలో రాజేశ్ రెడ్డి (30) ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన యువతితో నిన్న రాత్రి వాగ్వాదం జరగడంతో మనస్థాపం చెందిన రాజేశ్ తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి తల్లి, చెల్లి ఉన్నారు. వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 24, 2025

GNT: అన్నదాతల ఇంటికే ప్రభుత్వం- ‘రైతన్న మీకోసం’ ఆరంభం

image

గుంటూరు జిల్లాలో రైతుల కష్టాన్ని అర్థం చేసుకునేందుకు ప్రభుత్వం కొత్త కార్యక్రమం మొదలుపెట్టింది. రైతన్నా.. మీకోసం పేరుతో అధికారులు సోమవారం నుంచి నేరుగా రైతుల ఇళ్లను సందర్శించనున్నారు. పథకాలు ఎలా అందుతున్నాయి, ఎక్కడ జాప్యం ఉందో తెలుసుకుంటారు. పంచసూత్రాలు, యాంత్రీకరణ, సాంకేతిక పద్ధతులపై అవగాహన ఇస్తారు. రూ.14,000 పెట్టుబడి సహాయం అందించిన తర్వాత, ఇది మరో పెద్ద అడుగు అని అధికారులు చెబుతున్నారు.

News November 24, 2025

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు.. SP కీలక సూచన

image

రానున్న 4, 5 రోజుల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. సోమశిల నుంచి నీటిని విడుదల చేయనున్న నేపథ్యంలో పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అజిత కోరారు. ఆదివారం 27,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారని తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాన్ని బట్టి సోమశిల నుంచి నీటిని విడుదల చేస్తారని అన్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించారు.