News March 13, 2025
మడగాస్కర్ అధ్యక్షుడుతో చిత్తూరు MP భేటీ

మడగాస్కర్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షుడు జస్టిన్ టోక్లే తన ప్రతినిధి బృందంతో భారత దేశానికి వచ్చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఢిల్లీలో పార్లమెంటు సమావేశ మందిరంలో లోకసభ స్పీకర్ ఓం బిర్లా, చిత్తూరు MP దగ్గుమళ్ల ప్రసాద్ రావుతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు.
Similar News
News February 7, 2026
కుప్పంలో వరుసగా అమ్మాయిల మిస్సింగ్

కుప్పం నియోజకవర్గ పరిధిలో వారం రోజుల్లో ఐదుగురు యువతుల మిస్సింగ్ ఆందోళన కలిగిస్తోంది. ప్రేమ వ్యవహారమో లేక కుటుంబ కారణాల నేపథ్యమో తెలియదు గానీ మైనర్ బాలికలతో పాటు 22 ఏళ్లలోపు యువతులు అదృశ్యమవుతున్నారు. వారం రోజుల్లో రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, రాళ్ల బూదుగూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్క మిస్సింగ్ కేసు నమోదయింది.
News February 7, 2026
చిత్తూరు: కోళ్ల మృతి.. కారణం ఇదే..!

ఉమ్మడి చిత్తూరు జిల్లా సదుం మండలంలో వేలాది నాటు కోళ్లు చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో కంభంవారిపల్లె క్రాస్ వద్ద ఉన్న కోళ్ల ఫారాన్ని పశుసంవర్ధక శాఖ జేడీ ఉమాదేవి, జిల్లా అధికారులు శుక్రవారం పరిశీలించారు. వీటి నమూనాలను భోపాల్ ల్యాబ్ పంపించామని చెప్పారు. త్వరలోనే నివేదిక వస్తుందన్నారు. ప్రస్తుతం తమకున్న నివేదిక ప్రకారం దీనిని కొక్కర తెగుళ్లుగా భావిస్తున్నామన్నారు.