News October 15, 2024

మడికొండ: వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

image

ఆత్మహత్యాయత్నం చేసిన ఓ యువకుడిని పోలీసులు కాపాడారు. సీఐ కిషన్ తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మదనపల్లి గ్రామానికి చెందిన రాసమల్ల రమేశ్ కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి కుటుంబ సభ్యులకు సెల్ ఫోన్‌లో పంపించాడు. వారు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే మడికొండ పోలీసులు అప్రమత్తమై రమేశ్‌ను కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు.

Similar News

News November 28, 2025

‘టీఈ-పోల్’ యాప్ వినియోగించండి: వరంగల్ కలెక్టర్

image

ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారం సులభంగా చేరేందుకు రూపొందించిన టీఈ-పోల్ మొబైల్ యాప్‌ను వినియోగించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడిన ఆమె, గూగుల్ స్టోర్‌లో యాప్ అందుబాటులో ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రం, ఓటర్ స్లిప్ వంటి వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.

News November 27, 2025

వరంగల్: కొత్త విత్తన బిల్లుపై అభిప్రాయాలు సేకరించిన కలెక్టర్

image

కొత్త విత్తన బిల్లు-2025 ముసాయిదాపై రైతులు, విత్తన వ్యాపారులు, ఉత్పత్తిదారుల అభిప్రాయాలను సేకరించామని జిల్లా కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ఈరోజు వరంగల్ కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సంప్రదింపుల సమావేశంలో బిల్లులోని సెక్షన్లు, క్లాజులపై విస్తృతంగా చర్చించారు. హాజరైన వాటాదారులు ప్రతి అంశంపై తమ సూచనలు తెలియజేశారు. వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

News November 27, 2025

Te-Poll యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి: వరంగల్ కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు పూర్తి సమాచారాన్ని వేగంగా, సులభంగా అందించేందుకు రూపొందించిన Te-Poll మొబైల్ యాప్‌ ఇప్పుడు గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ డా.సత్యశారద తెలిపారు. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలు, ఓటర్ స్లిప్ నమోదు స్థితి వంటి కీలక సమాచారాన్ని ఒకే యాప్ ద్వారా తెలుసుకునే విధంగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన యాప్ ఇది అని పేర్కొన్నారు.