News September 5, 2024

మణుగూరుకు మావోయిస్టు మృతదేహాలు తరలింపు

image

కరకగూడెం మండల పరిధిలో ఇవాళ జరిగిన పోలీసులు- మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను మణుగూరు వంద పడకల ఆసుపత్రికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తరలించారు. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.

Similar News

News September 17, 2024

గత ప్రభుత్వం ఇచ్చింది 49 వేలు కార్డులు మాత్రమే: పొంగులేటి

image

ఖమ్మం: గత ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది కేవలం 49 వేల రేషన్ కార్డులు మాత్రమేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు, హెల్త్ కార్డులను మంజూరు చేస్తుందని చెప్పారు. దాదాపు 90 లక్షల కార్డులు ఇప్పుడు ఉన్నాయని, వాటిని బైఫరికేషన్ చేసి, స్మార్ట్ కార్డులు ఇస్తామని, ప్రతీ పేదవాడికి కార్డులు అందించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

News September 17, 2024

2035 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యం: భట్టి

image

2035 నాటికి తెలంగాణ రాష్ట్రం 40,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న నేటి ప్రపంచంలో ఆర్థిక, సామాజిక శ్రేయస్సుకు రిలయబుల్ ఎనర్జీ పునాది లాంటిదని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్‌ను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నారు.

News September 16, 2024

దారుణం.. 12 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం

image

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే బాలికతో కలిసి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.