News January 23, 2025
మణుగూరులో రోడ్డుప్రమాదం.. బీట్ ఆఫీసర్ మృతి

మణుగూరు బీటీపీఎస్ వద్ద బైక్, డీసీఎం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందారు. అతణ్ని ఏడూళ్ల బయ్యారం బోటిగూడెం బీట్ ఆఫీసర్ సాంబశివరావుగా స్థానికులు గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News October 14, 2025
ఆదిలాబాద్లో బంగారం రికార్డు ధర.!

బంగారం పేదవాడికి అందని ద్రాక్షగా మారనుందా.? అంటే వాటి గణాంకాలు చూస్తే అవుననే అనిపిస్తుంది. గత కొన్ని నెలలుగా పసిడి రేటు జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది. ఈరోజు మంగళవారం బంగారం ధర మార్కెట్లో తులానికి రూ.1,31,500 పలికి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. పసిడి రేటును చూసి సాధారణ ప్రజలు బెంబలెత్తిపోతున్నారు.
News October 14, 2025
మంథని: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం

మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి స్టేజీ సమీపంలో బొక్కల వాగు కట్ట కింద SSB ఇటుకల బట్టి సంపులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిది మంథని మండలం స్వర్ణపెళ్లి గ్రామం. అతడిని ఉప్పు మహేష్గా గుర్తించారు. మృతదేహం వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. మృతుడు గత ఐదు సంవత్సరాలుగా ట్రాక్టర్ మెకానిక్గా మంథనిలో పనిచేస్తున్నట్లు సమాచారం. పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంది.
News October 14, 2025
RGM: 74 షాపులకు 74 మంది దరఖాస్తులు

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని 24 WINES షాపులకు గాను ఇప్పటివరకు 9 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు ఆబ్కారీ శాఖ అధికారులు పేర్కొన్నారు. దరఖాస్తు ఫీజు గతంలో కంటే రూ.లక్ష ఎక్కువ ఉండడంతో వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా జిల్లాలోని 74 మద్యం షాపులకు గాను 74 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 18న దరఖాస్తు గడువు ముగియనుంది. అప్పటివరకు దరఖాస్తులు పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెప్తున్నారు.