News February 6, 2025

మణుగూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి.. పేరు ఇదే..!

image

మణుగూరు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పులి మూడేళ్లుగా జిల్లాలోకి ప్రవేశిస్తుంది. కానీ కొద్దిరోజులే జిల్లా దాటుతోంది. దీంతో 2 నెలల క్రితం వచ్చిన పులి తిరిగి వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రెండు నెలలుగా పులి జిల్లా దాటకపోవడంతో మగ పులిగా నిర్ధారించి ‘భద్ర’ అని నామకరణం చేశామని డీఎఫ్‌ఓ కృష్ణాగౌడ్‌‌ తెలిపారు. ఈనెల 2న కెమెరాకు చిక్కిందన్నారు.

Similar News

News March 27, 2025

ఖమ్మం: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాల డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై ఆమె చర్చించారు. కాంగ్రెస్‌పై BRS చేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చెసినట్లు సమాచారం. కాగా DCCలతో నేడు ఢిల్లీలో పార్టీ అధిష్ఠానం సమావేశం కానుంది.

News March 27, 2025

KMM: మిర్చి ధర రాలేదని కౌలు రైతు ఆత్మహత్య

image

పంట గిట్టుబాట ధర రాలేదని కౌలు రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన బోనగిరి ఉప్పలయ్య అనే కౌలు రైతు తాను పండించిన 40 క్వింటాళ్ల మిర్చి అమ్మితే గిట్టు బాటు ధర రాకపోవడంతో మనస్తాపం చెంది ఉరేసుకొని బలవన్మరణం చెందాడని తెలిపారు. మృత రైతుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News March 27, 2025

ఆడబిడ్డ పుట్టడం అదృష్టం: ఖమ్మం కలెక్టర్

image

ఆడపిల్ల పుట్టడం అదృష్టమని, ఇంటిలో ఆడపిల్ల పుడితే స్వీట్ బాక్స్ అందించి శుభాకాంక్షలు తెలిపే విధంగా జిల్లాలో ‘మా పాప-మా ఇంటి మణిదీపం’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామంలో కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ దంపతుల కుమార్తెను ఎత్తుకొని, సంబురం వ్యక్తం చేశారు.

error: Content is protected !!