News May 24, 2024
మణుగూరు నుంచి కోల్ కారిడార్

బొగ్గు గనుల ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేస్తున్న కోల్ కారిడర్ మణుగూరు నుంచి ప్రారంభం కానుంది. తాజాగా మణుగూరు – రామగుండం వరకు రైల్వే లైన్‌కు కేంద్రం పచ్చ జండా ఊపింది. ఇందుకుగాను రూ. 2,911 కోట్లు ఖర్చు చేయనుంది. మణుగూరులో ప్రారంభమయ్యే ఈ రైలు ఏటూరు నాగారం మీదుగా ములుగు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. భూపాలపల్లి నుంచి మంథని మీదుగా రామగుండం పరిధిలోని రాఘవాపురం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది.
Similar News
News February 13, 2025
ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన

ఖమ్మం జిల్లాలో నేడు (గురువారం) మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం నగరం, కొణిజర్ల మండలాల్లో పర్యటించి పలు భాదిత కుటుంబాలను పరామర్శిస్తారని అన్నారు. అనంతరం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.
News February 13, 2025
మైనారిటీ గురుకులాల్లో ప్రవేశానికి అడ్మిషన్లు

తెలంగాణ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు మైనారిటీస్ గురుకుల పాఠశాల, కళాశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కోరుతున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 28వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
News February 12, 2025
ఏపీ కోళ్లను అనుమతించొద్దు: అడిషనల్ ఎస్పీ

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ముదిగొండ మండలం వల్లభి చెక్ పోస్ట్ వద్ద వచ్చే కోళ్ల వాహనాలను అనుమతించొద్దని అడిషనల్ ఎస్పీ ప్రసాద్ రావు తెలిపారు. సీఐ మురళి, తహశీల్దార్ సునీత ఎలిజబెత్, పశు వైద్యాధికారులు అశోక్, రమేష్ బాబు, వైద్య అధికారి ధర్మేంద్ర, ఆర్ఐ ప్రసన్నకుమార్‌తో కలిసి వల్లభి చెక్ పోస్టు వద్ద ఆయన తనిఖీలు చేశారు. ఏపీ నుంచి వచ్చే కోళ్లను, ఇసుకను అనుమతించొద్దని సిబ్బందికి పలు సూచనలు చేశారు.