News June 19, 2024
మణుగూరు నుంచి దక్షిణ కొరియాకు భారజలం ఎగుమతి
దక్షిణ కొరియాకు 20 వేల లీటర్ల భారజలాన్ని భద్రాద్రి జిల్లాలోని మణుగూరు భారజల ప్లాంటు నుంచి ఎగుమతి చేశారు. గౌతమీనగర్ లోని పర్ణశాల అతిథిగృహం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో భారజలం ఉన్న కంటైనర్ వాహనాన్ని భారజల బోర్డు ఛైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.సత్య కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. సీఐఎస్ఎఫ్ బలగాల బందోబస్తు మధ్య ఈ వాహనం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనుంది.
Similar News
News November 30, 2024
ప్రభుత్వ విద్యా సంస్థల బంద్కు పిలుపు
ప్రభుత్వ విద్యా సంస్థల్లో వరసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలను నిరసిస్తూ రేపు ఖమ్మం జిల్లాలో విద్యా సంస్థల బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు అనేక మరణాలు జరిగాయని వారు ఆరోపించారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ఎగ్స్ గ్రేషియా చెల్లించి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. SFI,PDSU,AISF సంఘాలు బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు ఆసంఘాల ప్రతినిధులు తెలిపారు.
News November 29, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు
∆} ఖమ్మం:రైతుకు ఏది మేలు అయితే అదే అమలు చేస్తాం: తుమ్మల∆} ఖమ్మం జిల్లా కలెక్టర్ను కలిసిన సత్తుపల్లి ఎమ్మెల్యే∆}కొత్తగూడెం: కోచింగ్ లేకుండానే మూడు ఉద్యోగాలు∆} వైరా:భర్తపై భార్య కత్తితో దాడి∆} మధిర: షిఫ్ట్ కారులో వచ్చి పలు ఇండ్లలో దొంగతనాలు∆} మణుగూరు: జర్నలిస్టులపై కేసు కొట్టివేత∆}వెంకటాపురం:ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి
News November 29, 2024
మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై మీ కామెంట్..?
రైతు బంధుపై మంత్రి తుమ్మల ‘మహబూబ్ నగర్ రైతు పండుగ’ సభలో ఈరోజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘రైతుబంధు కంటే సన్నవడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ బాగుందని రైతులు అంటున్నారు’ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారన్నారు. తాము రైతులకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ పల్లకీలో ఊరేగించబోమని, ప్రభుత్వం తరఫున చేయాల్సినంత చేస్తామన్నారు. మంత్రి వ్యాఖ్యలపై మీ కామెంట్ తెలపండి.