News February 9, 2025
మణుగూరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
తొగ్గూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరుకు చెందిన భూక్య కమలమ్మ(60) మరణించింది. స్థానికుల సమాచారం మేరకు.. మణుగూరు నుంచి అశ్వాపురం వెళ్తుండగా రోడ్డు దాటే క్రమంలో బుల్లెట్ బండి ఢీకొని తీవ్ర గాయాల పాలైనట్లు చెప్పారు. అనంతరం సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించామన్నారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిపారు. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయని అన్నారు.
Similar News
News February 11, 2025
యాదాద్రిలో శ్రీవారి ఆదాయం రూ.22,60,628
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఖజానాకు సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కర్ రావు వెల్లడించారు. ప్రధాన బుకింగ్, వీఐపీ, బ్రేక్ దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కళ్యాణ కట్ట, వ్రతాలు, యాద ఋషి నిలయం, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, అన్నదాన విరాళాలు, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.22,60,628 ఆదాయం వచ్చిందని ప్రకటించారు.
News February 11, 2025
విశాఖ: ఆన్‌లైన్ లోన్‌యాప్స్ ముఠా అరెస్ట్
ఆన్ లైన్ లోన్ యాప్స్‌తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సోమవారం అరెస్ట్ చేశారు. విశాఖలో ఓ సూసైడ్ కేసు విచారణలో భాగంగా లోన్ యాప్‌లో అప్పు తీసుకుని సమయానికి కట్టకపోవడంతో ఫొటోలు మార్ఫింగ్ చేసి వారు వేధించడం వల్ల చనిపోయినట్లు గుర్తించారు. ఈ విషయంపై విశాఖ పోలీసులు నిందితుడుని కర్నూలులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
News February 11, 2025
మేడ్చల్ జిల్లా వాసులకు రేషన్ కార్డులు (UPDATE)
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 33,435 మంది రేషన్ కార్డులు కావాలని దరఖాస్తులు చేసుకున్నారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యంత్రాంగం ప్రత్యేక వివరాలను విడుదల చేసింది. ప్రభుత్వానికి ఈ వివరాలను పంపామని స్పష్టం చేసింది. త్వరలోనే ప్రభుత్వం నుంచి నిర్ణయం రాగానే అందరికీ కార్డులు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.