News December 8, 2024
‘మతాలకతీతంగా మనిషిని ఆవిష్కరించేదే కవిత్వం’

మతాలకతీతంగా మనిషిని ఆవిష్కరించేదే కవిత్వం అని ప్రముఖ కవులు జనజ్వాల అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ప్రముఖ విద్యావేత్త కే లక్ష్మణ్ గౌడ్ అధ్యక్షతన కవి సమ్మేళనం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం రాష్ట్ర మహాసభలు ఈనెల 14న MBNRలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మతం కంటే ముందు మనుషులని, మానవత్వమే సమాజ ప్రగతికి దోహదపడుతుందని తెలిపారు.
Similar News
News December 20, 2025
MBNR: విదేశాల్లో ఉన్నత విద్య.. అప్లై చేసుకోండి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు విదేశాలలో అత్యున్నత విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ అభివృద్ధి అధికారిణి ఇందిర “Way2News” ప్రతినిధితో తెలిపారు. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు ఈనెల 21లోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 20, 2025
MBNR: సర్పంచ్ ఎన్నికలు..అప్పులు తీర్చేదెలా..?

ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల పుణ్యామా.. వందలాది కుటుంబాల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. పోటీకోసం చేసిన ఖర్చు తడిసి మోపెడయ్యాయి. ఇప్పుడు అప్పులు తీర్చేదెలా? అని ఓటమి అభ్యర్థుల కుటుంబాల్లో తీవ్ర అంతర్మథనం నెలకొంది. ‘రిజర్వేషన్లు అనుకూలంగా వచ్చాయని పోటీ చేస్తే.. తీరా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసినా.. గెలవకపోతిమి ఉన్న ఆస్తులు, బంగారం పాయే.. అప్పుల కుప్పాయె’ అంటూ చాలా కుటుంబాలు కుమిలిపోతున్నాయి.
News December 20, 2025
MBNR: ఊర్లో సంబరాలు.. యువతిపై అత్యాచారం

సర్పంచ్ ఎన్నికల విజయోత్సవాల నడుమ ఘోర విషాదం MBNR(D) మూసాపేట(M) మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. SI వేణు వివరాల ప్రకారం.. సంబరాలను వీక్షించడానికి వచ్చిన ఓ యువతిని విష్ణు రైతు వేదిక వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పెరేంట్స్ ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.


