News February 4, 2025

మత్తులో పురుగు మందు తాగాడు..

image

మద్యం మత్తులో ఓ వ్యక్తి పురుగు మందు తాగాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. ఆదోని మండలం నాగనాథనహళ్లికి చెందిన సిద్ధప్ప (40) మద్యం మత్తులో ఉన్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తెలియక పురుగు మందుతాగాడు. అనంతరం అపస్మారకస్థతిలోకి వెళ్లాడు. కాసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 15, 2025

నిజంగా రూ.1200కు ఉల్లి కొన్నారా?: SV

image

చంద్రబాబు సర్కారుకు ఉల్లి రైతుల కష్టాలు కనిపించవా? అని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిజంగా రూ.1,200తో ఉల్లిని కొనుగోలు చేస్తే రైతులు ఎందుకు రోడ్లపై పడేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని, వారికి మద్దతుగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

News September 14, 2025

కర్నూలు: ‘ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి’

image

ప్రతి ఒక్కరు వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలులోని కొండారెడ్డి బురుజు వద్ద ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ‘సండేస్ ఆన్ సైక్లింగ్’ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని, ప్రతి ఆదివారం పోలీసులు సైకిల్ తొక్కాలని పిలుపునిచ్చారు.

News September 14, 2025

కర్నూలు జిల్లా MPకి 15వ ర్యాంక్

image

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు 15వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 70 ప్రశ్నలు అడగటంతోపాటు 7 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు శాతం 91.18గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.