News December 30, 2024

మత్తు పదార్థాల నిర్మూలనకు అందరూ సహకరించాలి: కలెక్టర్

image

మత్తు పదార్థాల నియంత్రణకు ప్రతి అధికారి కృషి చేయాలని కలెక్టర్ పీ.రంజిత్ బాషా అన్నారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మత్తుపదార్థాల నియంత్రణకు సంబంధించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశాన్ని ఎస్పీ జి.బిందు మాధవ్‌తో కలిసి కలెక్టర్ నిర్వహించారు. విద్యాలయాల పరిసర ప్రాంతాల్లో మత్తుపదార్థాల ఆనవాళ్లు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News December 20, 2025

కర్నూలు: మిరప పంటలో గంజాయి సాగు

image

చిప్పగిరి మండలం దేగులపాడు గ్రామ పరిధిలో మిరప పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పొలాన్ని తనిఖీ చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 20, 2025

నూతన ఆలోచనలతో అద్భుతాలు సృష్టించాలి: కలెక్టర్

image

నూతన ఆలోచనలతో విద్యార్థులు అద్భుతాలు సృష్టించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కర్నూలు ప్రభుత్వ టౌన్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలను డీఈవో సుధాకర్, ఏపీసీ లోకరాజుతో కలిసి ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి నమూనాలను రూపొందించాలన్నారు.

News December 20, 2025

క్రిస్మస్, న్యూ ఇయర్.. కర్నూలు ఎస్పీ హెచ్చరిక

image

క్రిస్మస్, న్యూ ఇయర్ గిఫ్ట్ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని SP విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే గిఫ్ట్ కార్డు లింకులతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే 1930, 100, 102కు కాల్ చేయాలన్నారు.