News February 22, 2025

మత్స్యకారులు పథకాలు ఉపయోగించుకోవాలి: కలెక్టర్

image

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతున్న పథకాలను కృష్ణా జిల్లాలోని మత్స్యకారులు, ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీ.కే.బాలాజి కోరారు. కలెక్టరేట్‌లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజ పథకం వినియోగంపై శనివారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు.

Similar News

News March 23, 2025

ఈనెల 30న కృష్ణా జిల్లాకు సీఎం చంద్రబాబు 

image

సీఎం చంద్రబాబు ఈనెల 30వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో జరిగే ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. 30వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమక్షంలో ఈ ఉగాది సంబరాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా చంద్రబాబు హాజరుకానున్నారు. 

News March 23, 2025

కానూరులో వ్యభిచార గృహంపై దాడి

image

కానూరులోని జమదగ్ని వీధిలో వ్యభిచార గృహంపై శనివారం పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. తెనాలికి చెందిన నిర్వాహకురాలు, ఇద్దరు విటులు, మరో మహిళను అరెస్ట్ చేసి, రూ. 2,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

News March 22, 2025

కృష్ణా: 10వ తరగతి ఓరియంటల్ పరీక్షకు 99.82% హాజరు 

image

కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించిన 10వ తరగతి ఓరియంటల్ పరీక్షకు 99.82% మంది విద్యార్థులు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. 5,581 మంది విద్యార్థులకు గాను 5,571 మంది హాజరయ్యారని, 10 మంది గైర్హాజరైనట్టు డీఈఓ తెలిపారు. పలు పరీక్షా కేంద్రాలను స్క్వాడ్ టీములు పరిశీలించగా ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదన్నారు. 

error: Content is protected !!