News December 4, 2024
మత్స్యకారుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలేంటి: ఎంపీ వేమిరెడ్డి

దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి బుధవారం కోరారు. లోక్సభలో ఆయన మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారుల నైపుణ్యాభివృద్ధికి, శిక్షణ అందించడానికి ప్రభుత్వం ఏదైనా పథకాలను అమలు చేస్తుందా అని ప్రశ్నించారు.
Similar News
News December 13, 2025
BREAKING: నెల్లూరు మేయర్ రాజీనామా

అనుహ్య పరిణామాల మధ్య నెల్లూరు నగర మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించి రాజీనామా ప్రకటన చేశారు. కలెక్టర్ని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందిస్తానని చెప్పారు. మేయర్గా రాజీనామా చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తనను మేయర్ని చేసిన వైసీపీ అధినేత జగన్కు రుణపడి ఉంటానన్నారు.
News December 13, 2025
మరికాసేపట్లో మీడియా ముందు నెల్లూరు మేయర్

నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా అవిశ్వాస తీర్మానంపై రాజకీయం వేడెక్కింది. ఉదయం ఒక కార్పొరేటర్.. సాయంత్రం మరొక కార్పొరేటర్ మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు. దీనిపై మేయర్ స్రవంతి మరికాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. ఆమె ఏం మాట్లాడుతారు.. ఎవరి గురించి మాట్లాడుతారో ఉత్కంఠంగా నగర, జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
News December 13, 2025
గోవా క్యాంపునకు నెల్లూరు వైసీపీ కార్పొరేటర్లు..?

కొంచెం.. కొంచెంగా నెల్లూరు వైసీపీ కార్పొరేటర్ల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే 41 స్థానాలు కైవసం చేసుకున్న TDP మిగిలినవారిని లాగేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. వైసీపీ పరువు కాపాడుకొనే ప్రయత్నంలో పడిపోయింది. ఉన్న 11 స్థానాలను అయినా కాపాడుకునేందుకు గోవా క్యాంపునకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


