News April 2, 2025

మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటాం: అచ్చెన్న

image

వేటకెళ్లి మృతి చెందిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేటకెళ్లిన బుంగ ధనరాజు, వంక కృష్ణ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, మత్స్య శాఖల నుంచి వేరువేరుగా రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చెరో రూ. పది లక్షలను ఆ కుటుంబాలకు త్వరలో అందజేస్తామన్నారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

Similar News

News April 8, 2025

SKLM: ‘అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు’

image

శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పలు మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీలను చట్ట పరిధిలో ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత శాఖాధికారులకు ఎండార్స్ చేసి  పరిష్కరించాలని చెప్పారు.  

News April 7, 2025

లావేరు: ‘బెట్టింగ్ యాప్‌లపై చర్యలు తీసుకోవాలి’

image

లావేరు మండలం మురపాక గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త మీసాల భానోజీ రావు సోమవారం జరిగిన కలెక్టర్ మీకోసం కార్యక్రమంలో బెట్టింగ్ యాప్‌లపై ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్‌ల మాఫియాపై నిఘా ఉంచాలని, వాటిని అరికట్టకపోవడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు.  

News April 7, 2025

మడపాం: వంశధార నదిలో జారిపడి మత్స్యకారుడు మృతి

image

నరసన్నపేట మండలం మడపాం వద్ద వంశధార నదిలో ప్రమాదవశాత్తు జారిపడి మత్స్యకారుడు మృతి చెందాడు. సోమవారం ఉదయం చేపల వేట కోసం వెళ్లిన వాడ అంజలి అప్పన్న నదిలో వల విసరగా పెద్ద బండరాయి వలకు తగిలింది. చేపలు పడి ఉంటాయని గట్టిగా లాగడంతో జారిపడి మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!