News December 31, 2024
మత్స్యావతారంలో భద్రాద్రి రామయ్య దర్శనం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు వైభవంగా ఆరంభమయ్యాయి. తొలిరోజు మంగళవారం దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి మంత్రోచ్చారణలతో క్రతువును కమనీయంగా కొనసాగించారు. స్వామివారు మత్స్యావతారంలో దర్శనమివ్వడంతో భక్తులు మురిసిపోయారు. తిరువీధిసేవ ఆధ్యాత్మికతను చాటగా సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బుధవారం కూర్మావతారం దర్శనం ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.
Similar News
News January 18, 2025
ఖమ్మంలో విషాదం.. చెరువులో దంపతుల మృతదేహాలు లభ్యం
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో విషాదం నెలకొంది. బుగ్గపాడు గ్రామానికి చెందిన కృష్ణ(60), సీత(55) దంపతులు అదే గ్రామంలోని రావి చెరువులో శవమై తేలడం స్థానికుల్లో ఆందోళన కలిగించింది. దంపతులు ఆర్థిక ఇబ్బందులతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 18, 2025
KMM: శతాబ్ది బ్రిడ్జిపై.. నిలిచిన రాకపోకలు
నిజాం హయాంలో ఖమ్మంలో నిర్మించిన మున్నేరు బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల వరదలకు బ్రిడ్జి ప్రమాదకరంగా మారడంతో రాకపోకలు నిలిపివేశారు. అటు రూ.187కోట్లతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పూర్తికి మరో ఏడాది పడుతుందంటున్నారు. దీంతో పక్కనే కాజ్‌వేపై రాకపోకలు పునరుద్ధరించడంతో ట్రాఫిక్‌తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
News January 18, 2025
ప్రతి గామానికి ఒక రెవెన్యూ అధికారి: మంత్రి పొంగులేటి
పంచాయతీ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమించేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతుందని సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. HYD సచివాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 450 మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారని, మరో వెయ్యి మందిని నియమించేలా అధికారులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.