News December 22, 2024

మత్స్య శాఖ వనరులను అభివృద్ధి పరచండి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో మత్స్య శాఖ వనరులను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి మత్స్య శాఖ ఉప డైరెక్టర్ రాఘవరెడ్డిని ఆదేశించారు. శనివారం కలెక్టర్ ఛాంబర్‌లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. అత్యల్పంగా చేపల పెంపకం మన జిల్లాలోనే ఉందన్నారు. మత్స్య సంపద అభివృద్ధి చెందడానికి కృషి చేయాలన్నారు.

Similar News

News January 24, 2025

వినతులను త్వరితగతిన పరిష్కరించాలి: ఆదోని సబ్ కలెక్టర్

image

గోనెగండ్ల గ్రామంలోని మండల తహశీల్దార్ కార్యాలయాన్ని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, భూ సమస్యల పరిష్కారం కోసం రైతుల నుంచి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో తహశీల్దార్ కుమారస్వామి పాల్గొన్నారు.

News January 24, 2025

నంద్యాల: కారు కొంటామని ఎత్తుకెళ్లారు

image

నంద్యాల ఆటోనగర్‌లో కారు విక్రయించడానికి వచ్చిన ఇరువురు వ్యక్తులను కారు కొంటాని నమ్మించి కారు ఎత్తుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం తెలంగాణ నారాయణపేటకు చెందిన వెంకటేష్ రెడ్డి కారు నంద్యాలలో విక్రయించి రావాలని దళారి రాఘవేంద్ర, హనుమంతుకు అప్పగించారు. వారు NDL ఆటోనగర్‌కు రాగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం వెంకటేష్ రెడ్డి తాలూకా స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు.

News January 24, 2025

నంద్యాల జిల్లా కలెక్టర్‌కు అవార్డు

image

నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాకు బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ అవార్డు వరించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గానూ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఆమెకు అవార్డును బహూకరించనున్నారు.