News May 24, 2024
మదనపల్లి: కూటమి MLA అభ్యర్థిపై ఫిర్యాదు

మదనపల్లె కూటమి MLA అభ్యర్థి షాజహాన్‌పై TDP అధిష్టానానికి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో షాజహాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని,తమపై ఇష్టానుసారంగా దూషించారని రామసముద్రం మండలం కురిజల పంచాయితీలోని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజుకు ఫిర్యాదు చేశామన్నారు.
Similar News
News February 17, 2025
తిరుపతి నగరంలో దారుణ హత్య

తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో జగదీశ్ (40)అనే వ్యక్తిని సునీల్ అనే వ్యక్తి హత్య చేశాడు. మద్యం మత్తులో జగదీశ్ భార్యతో సునీల్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో సునీల్‌ను ప్రశ్నించడంతో పదునైన ఇనుప చువ్వతో జగదీశ్ గుండెలపై పొడిచాడు. తీవ్రగాయాలైన జగదీశ్‌ను ఆసుపత్రికి తరలించే లోపు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అలిపిరి సీఐ రామ్ కిషోర్ విచారణ చేస్తున్నారు. సునీల్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
News February 17, 2025
పలమనేరు: బిడ్డకు జన్మనిచ్చి కన్నుమూసిన విద్యార్థిని

విద్యార్థిని ఓ బిడ్డకు జన్మనిచ్చి తాను కన్నుమూసిన ఘటన పలమనేరులో చోటు చేసుకుంది. మండలంలో ఓ బాలిక(16) ప్రభుత్వ హైస్కూల్లో 10వ తరగతి చదువుతోంది. ఈక్రమంలో విద్యార్థినిపై ఓ కామాంధుడు లైంగిక దాడి చేసి గర్భవతిని చేశాడు. పురిటి నొప్పులు అధికమవడంతో బంగారుపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యుల సిఫార్సుతో చిత్తూరుకు తరలించారు. రక్తస్రావం అధికమవడంతో శిశువుకు జన్మనిచ్చి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.
News February 16, 2025
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

గంగవరం మండలంలో నాలుగు రోడ్ల వద్ద రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు బైకులు అధిక వేగంతో వస్తూ ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా 108 వాహనంలో పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.