News March 4, 2025
మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి: షాజహాన్ బాషా

మదనపల్లెలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం అసెంబ్లీ వేదికగా స్పీకర్ను కోరారు. ఇది నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమని పేర్కొన్నారు. 1860 నుంచి మదనపల్లె పరిపాలన రాజధానిగా గుర్తింపు పొందిందన్నారు. ఆటోనగర్, ఐటి కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని సీఎంను కోరారు.
Similar News
News December 13, 2025
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయి: కలెక్టర్

గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా శనివారం భీమవరం ఎస్ఆర్ కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల క్రీడా ప్రాంగణంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం డివిజన్ ఉద్యోగుల క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..గోదావరి క్రీడోత్సవాల్లో భాగంగా నేటి నుంచి జిల్లావ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ల వారీగా పోటీలు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయని అన్నారు.
News December 13, 2025
ఈనెల 18న ఆత్మకూరులో కబడ్డీ జిల్లా సెలక్షన్స్

యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ సెలక్షన్స్ డిసెంబర్ 18న ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్లో జరుగుతాయని జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పూర్ణచందర్ రాజ్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డుతో పీఈటీ ఇందిరకి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఎంపికైన జట్టు డిసెంబర్ 25న ఖమ్మంలో ఆడునుందని పేర్కొన్నారు.
News December 13, 2025
చౌటుప్పల్: ‘ఆస్తులు పెరిగితే గ్రామానికే రాసిస్తా’

యాదాద్రి జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా చౌటుప్పల్ మండలంలో దేవలమ్మ నాగారం సర్పంచ్ అభ్యర్థి కొండ హారిక విజయ్ వినూత్నంగా హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం తన ఆస్తులు పెరిగితే ఆ పెరిగిన ఆస్తులన్నింటినీ గ్రామాభివృద్ధికి ప్రజల పేరున రాసిస్తానని బాండ్ పేపర్పై రాసి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. కాగా హారిక విజయ్ హామీ ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.


