News April 2, 2024

మదనపల్లెను హైటెక్ సిటీ చేశారా: సీఎం జగన్

image

మదనపల్లెలో సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో ప్రతి నగరంలో హైటెక్ సిటీని నిర్మిస్తానని అన్నారని, మదనపల్లెలో నిర్మించాడా అని విమర్శించారు. ‘అరుంధతి సినిమాలో పశుపతి లాగా.. వదల బొమ్మాళీ వదల.. అంటూ పేదల రక్తం పీల్చేందుకు కేకలు పెడుతున్నారు’ అని ఫైరయ్యారు.

Similar News

News December 9, 2025

చిత్తూరు పోలీసులకు 46 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 46 ఫిర్యాదుల అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 8, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 7 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.

News December 9, 2025

పెన్షన్ అర్హులకు జిల్లా కలెక్టర్ భరోసా

image

చిత్తూరు జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్క వికలాంగులకు పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ వికలాంగులకు భరోసా కల్పించారు. వికలాంగుల పెన్షన్ మంజూరు చేస్తామనే దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇకపై అర్హులకు మాత్రమే అందజేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. 6 దశలలో పరిశీలన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సదరం ధ్రువపత్రాలు వైద్య బృందాలతో తనిఖీ చేస్తున్నామన్నారు.