News March 15, 2025

మదనపల్లెలో ‘నారికేళి’ సినిమా షూటింగ్

image

వైష్ణవి మూవీ మేకర్స్ సమర్పణలో ‘నారికేళి’ అనే సినిమా షూటింగ్ మదనపల్లెలో ప్రారంభమైంది. శుక్రవారం బర్మా వీధిలోని సాయిబాబా ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం హీరో కిరణ్ గోవింద్ సాయి, హీరోయిన్ స్వాతి రెడ్డిపై దర్శకుడు సీ.రెడ్డిప్రసాద్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో స్థానిక నూతన నటీనటులతో సందేశాత్మకంగా ఈ సినిమా రూపొందించనున్నట్లు నిర్మాత చంద్రశేఖర్ తెలిపారు.

Similar News

News November 7, 2025

HYD: ట్రబుల్ షూటర్ వచ్చేస్తున్నారు!

image

పితృవియోగంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు మళ్లీ యుద్ధరంగంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు దగ్గర పడుతుండడంతో, ట్రబుల్ షూటర్‌గా ఆయన ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. BRS జైత్రయాత్రను జూబ్లీహిల్స్ నుంచే మొదలు పెట్టేందుకు, హరీశ్ వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

News November 7, 2025

NRPT: నవంబర్ 14న ‘చదువుల పండగ’: కలెక్టర్

image

నవంబర్ 14న జిల్లా స్థాయిలో ‘చదువుల పండగ-కలలు కనేద్దాం, నేర్చుకుందాం, సాధిద్దాం!’ అనే నినాదంతో మహా వేడుక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన ఈ కార్యక్రమ పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నేర్చుకునే ఉత్సాహం నింపే లక్ష్యంతో ఈ పండుగను నిర్వహిస్తున్నామని కలెక్టర్ వివరించారు.

News November 7, 2025

సిద్ధవటం: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో కౌలు రైతు వెంకట నరసారెడ్డి(60) ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లికి చెందిన వెంకటనరసారెడ్డికి పంటలు చేతికి అందక రూ.40 లక్షల అప్పులయ్యాయి. ఆ బాధతో పురుగు మందు తాగి APSP 11వ బెటాలియన్ వెనుకవైపు ఉన్న పొలాల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య కుమారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.