News March 15, 2025
మదనపల్లెలో ‘నారికేళి’ సినిమా షూటింగ్

వైష్ణవి మూవీ మేకర్స్ సమర్పణలో ‘నారికేళి’ అనే సినిమా షూటింగ్ మదనపల్లెలో ప్రారంభమైంది. శుక్రవారం బర్మా వీధిలోని సాయిబాబా ఆలయంలో పూజా కార్యక్రమాల అనంతరం హీరో కిరణ్ గోవింద్ సాయి, హీరోయిన్ స్వాతి రెడ్డిపై దర్శకుడు సీ.రెడ్డిప్రసాద్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో స్థానిక నూతన నటీనటులతో సందేశాత్మకంగా ఈ సినిమా రూపొందించనున్నట్లు నిర్మాత చంద్రశేఖర్ తెలిపారు.
Similar News
News July 11, 2025
గుంటూరు: రైస్ కార్డులకు దరఖాస్తుల వెల్లువ

రైస్ కార్డుల కోసం గుంటూరు జిల్లాలో 52,447 దరఖాస్తులు అందగా, వీటిలో 90% సమస్యలు పరిష్కారం అయ్యాయి. కొత్తగా 8 వేలకుపైగా కార్డులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. అత్యధికంగా పేర్ల చేర్పు దరఖాస్తులే రావడం గమనార్హం. తెనాలి, గుంటూరు డివిజన్‌లలో అధిక స్పందన కనిపించింది. పేర్ల తొలగింపు, చిరునామా మార్పు, కార్డు విభజనలపై కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇంకా 4,300లకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
News July 11, 2025
‘బాహుబలి ది ఎపిక్’ రన్‌టైమ్ 5.27 గంటలు

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1&2’ సినిమాలను ఒకే మూవీగా ‘బాహుబలి ది ఎపిక్’గా రిలీజ్ చేయనున్నారు. అక్టోబర్ 31న విడుదల కానున్న ఈ చిత్ర రన్‌టైమ్ రివీలైంది. దాదాపు 5 గంటల 27నిమిషాలు సినిమా ఉండనుందని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈక్రమంలో దీనిపై ‘బాహుబలి’ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసింది. ‘కంగారు పడకండి. మేము మీ రోజు మొత్తాన్ని తీసుకోవట్లేదు. ఇది IPL మ్యాచుకు సమానం’ అని రాసుకొచ్చింది.
News July 11, 2025
అమెరికాలో రిచెస్ట్ ఇండియన్ ఇతడే

విద్య, ఉపాధి కోసం అమెరికా వెళ్లిన కొందరు భారతీయులు అక్కడివారిని మించి సంపాదిస్తున్నారు. ‘2025 అమెరికా రిచెస్ట్ ఇమ్మిగ్రెంట్స్ లిస్ట్’ను ఫోర్బ్స్ విడుదల చేసింది. ఇందులో జెడ్‌స్కేలర్ కో ఫౌండర్ జై చౌదరి $17.9 బిలియన్లతో (రూ.1.53 లక్షల కోట్లు) అగ్ర స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వినోద్ ఖోస్లా ($9.2 billion), రాకేశ్ గంగ్వాల్ ($6.6 b), రొమేశ్ టీ వాద్వానీ ($5.0 b), రాజీవ్ జైన్ ($4.8 b) ఉన్నారు.