News February 27, 2026

మదనపల్లెలో పడిపోయిన టమాటా ధరలు

image

మదనపల్లెలో టమాటా ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఉదయం 74 వేల కిలోల టమాటాలను రైతులు తీసుకువచ్చారు. 10 కిలోల మొదటి రకం రూ. 130కి అమ్ముడు పోగా.. రెండో రకం రూ. 100, మూడో రకం రూ. 90 కి అమ్మినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. అన్ సీజన్ కారణంగా టమాటాకు రేట్లు రావడం లేదని మార్కెటింగ్ అధికారులు తెలిపారు.

Similar News

News April 18, 2026

ప్రకృతి నడుమ ఆధ్యాత్మికతకు ప్రతీక ఏడుపాయల ఆలయం

image

ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. ఏడూ వాగులు సంగమించే ప్రదేశంలో వెలసిన వన దుర్గాభవాని అమ్మవారిని దర్శించేందుకు ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు వస్తారు. పురాణాల ప్రకారం అమ్మవారు స్వయంభువుగా వెలసి భక్తులను కాపాడుతున్నారని విశ్వాసం. మహాశివరాత్రి, జాతర సమయంలో ఆలయం సందడిగా మారుతుంది. ప్రకృతి సౌందర్యం మధ్యలో ఉన్న ఈ క్షేత్రం ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తోంది.

News April 18, 2026

జియో IPO.. టార్గెట్ రూ.50,000కోట్లు!

image

రిలయన్స్ జియో త్వరలో ఐపీఓకు రానున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో సెబీకి ఐపీవో పత్రాలను సమర్పించనుంది. సుమారు రూ.40,000-50,000కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇదే జరిగితే దేశంలో అతిపెద్ద ఐపీఓగా రికార్డ్ నెలకొల్పనుంది. IPO నిర్వహణ కోసం 17 మర్చంట్ బ్యాంకింగ్ సంస్థలను జియో నియమించుకుంది. సంస్థ మార్కెట్ వాల్యూ రూ.16.72లక్షల కోట్లు కాగా ఇందులో 2.5% వాటా విక్రయించాలని యోచిస్తున్నట్లు సమాచారం.

News April 18, 2026

భువనగిరి కోటలోకి నేడు ఫ్రీ ఎంట్రీ

image

ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ తీపి కబురు అందించింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మ్యూజియంలు, చారిత్రక కట్టడాలకు ఉచిత ప్రవేశం కల్పించింది. భువనగిరిను సందర్శకులు ఇవాళ ఉచితంగా చూడవచ్చు. మన వారసత్వ సంపదపై ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే ప్రభుత్వం ఈ గొప్ప అవకాశం కల్పించింది.