News August 29, 2024
మదనపల్లెలో ముగిసిన సీఐడీ దర్యాప్తు
మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దగ్ధం కేసులో సీఐడీ అధికారుల విచారణ మొదటి అంకం ముగిసింది. సోమవారం సాయంత్రం మదనపల్లెకి చేరుకున్న CID చీఫ్ రవిశంకర్ అయ్యర్, జిల్లా SP విద్యాసాగర్ నాయుడు, CID DSP వేణుగోపాల్ సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ సిబ్బందిని విచారించారు. అదేరోజు రాత్రే సీఐడీ చీఫ్, జిల్లా ఎస్పీ వెళ్లిపోగా మంగళవారం డీఎస్పీ వేణుగోపాల్ విచారణ కొనసాగించారు.
Similar News
News September 11, 2024
ఆ పథకంపై అవగాహన కల్పించండి: కలెక్టర్
చిత్తూరు: పీఎం విశ్వకర్మ యోజన రిజిస్ట్రేషన్ కోసం లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. పథకం అమలుపై కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించారు. 18 రకాల చేతివృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. దీనిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. డిసెంబర్ లోపు లక్ష్యాలు చేరుకోవాలన్నారు.
News September 11, 2024
చిత్తూరు కలెక్టర్ హెచ్చరికలు
చిత్తూరు జిల్లాలో మాతృ, శిశు మరణాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో DCHS డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, DMHO డాక్టర్ ఓ.ప్రభావతి దేవి, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఎక్కడైనా మాతృ మరణాలు జరిగితే సంబంధిత డాక్టర్లపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 10, 2024
సత్యవేడు MLA వివాదం..వైద్య పరీక్షలకు నో చెప్పిన మహిళ
సత్యవేడు MLA కేసు రోజుకో మలుపుతిరుగుతోంది. ఆదిమూలం అత్యాచారం చేశాడంటూ ఆరోపించిన మహిళ TPT ఈస్ట్ పోలీసులపై మండిపడింది. ‘నన్ను ఎందుకు విచారిస్తున్నారు. నేను ఫిర్యాదు చేశా. MLAని అరెస్టు చేయండి’ అన్నది. అత్యాచార కేసులో వైద్యపరీక్షలు తప్పనిసరని CI మహేశ్వరరెడ్డి చెప్పినా పట్టించుకోలేదు. ఇబ్బంది పెట్టవద్దని, తాను హాజరుకానని తేల్చి చెప్పారు. గుండె నొప్పిగా ఉందని వైద్యానికి చెన్నై వెళ్తున్నట్లు తెలిపారు.