News March 30, 2024
మదనపల్లెలో యువకుడిపై కత్తితో దాడి

మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా ప్రశ్నించిన యువకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. మదనపల్లె పట్టణంలోని సీటీఎం రోడ్డులో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానిక శివాజీ నగర్లో ఉంటున్న షేక్ మస్తాన్ కుటుంబంలోని మహిళలతో అదే వీధిలో ఉండే ఇర్షాద్ అసభ్యకర పదజాలంతో మాట్లాడాడు. దీంతో అతడిని మస్తాన్ నిలదీశాడు. ఆగ్రహించిన ఇర్షద్ మస్తాన్‌పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు.
Similar News
News November 11, 2025
చిత్తూరు: విస్తృతంగా పోలీసుల తనిఖీ

ఢిల్లీలో జరిగిన దాడుల నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు జిల్లా అంతటా అన్ని ముఖ్యమైన రహదారులు, చెక్‌పోస్టులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు పట్టణ ప్రవేశ ద్వారాల వద్ద విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు చేపట్టారు. లాడ్జిలు, హోటళ్లలో సైతం తనిఖీలు చేశారు. అనుమానితులపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
News November 10, 2025
రేపు జిల్లాలో నాలుగు పరిశ్రమల స్థాపనకు CM ప్రారంభోత్సవం

జిల్లాలో నాలుగు నూతన పరిశ్రమల స్థాపనకు సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో మంగళవారం ప్రారంభోత్సవం చేస్తారని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు, కుప్పం, పుంగనూరు, నగరి మండలాల పరిధిలో 116 ఎకరాలలో రూ.56.76 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమాలలో సంబంధిత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు.
News November 10, 2025
చిత్తూరు: సమస్యల పరిష్కారానికి వినతులు

పీజీఆర్ఎస్లో వచ్చే ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. పెద్దపంజాణి మండలానికి చెందిన లక్ష్మీదేవి వన్ బీ కోసం, బొమ్మసముద్రం చెందిన భువనేశ్వరి వితంతు పింఛన్ కోసం, పీసీ గుంటకు చెందిన గుర్రప్ప పట్టాదారు పాసు పుస్తకం కోసం వినతి పత్రాలు ఇచ్చారు. మొత్తం 301 ఫిర్యాదులు వచ్చాయి.


