News May 25, 2024

మదనపల్లెలో యువకుడు దారుణ హత్య

image

మదనపల్లిలోని రామారావు కాలనీకి చెందిన పుంగనూరు శేషు దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి స్థానిక వైఎస్ఆర్ కాలనీలో శేషును ప్రత్యర్థులు పథకం ప్రకారం హత్యచేసినట్లు ప్రాథమిక సమాచారం. యువకుడి హత్య జరిగిన విషయాన్ని తెలుసుకున్న మదనపల్లి రెండో పట్టణ పోలీసులు ఘటనాస్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 6, 2025

బోయకొండ గంగమ్మ భక్తులకు గమనిక

image

బోయకొండ గంగమ్మ ఆలయంలో శాశ్వత నిత్యార్చన సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ఈవో ఏకాంబరం ఓ ప్రకటనలో తెలిపారు. అధికారుల ఆదేశాలతో సంక్రాంతి నుంచి అమ్మవారికి శాశ్వత నిత్యార్చన నిర్వహిస్తామని చెప్పారు. ఏడాదికి రూ.10,116, 6నెలలకు రూ.7,116, 3నెలలకు రూ.5,116, నెలకు రూ.2,116తో సేవా టిక్కెట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కుంకుమార్చన రూ.101, వడి బాల సేవ రూ.201తో నూతన సేవలు ప్రవేశ పెడతామన్నారు.

News December 6, 2025

హోంగార్డుల సంక్షేమానికి కృషి: చిత్తూరు SP

image

హోంగార్డుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొని కవాతు ప్రదర్శనను వీక్షించారు. చిత్తూరు జిల్లాలో శాంతిభద్రతల కోసం 357 మంది హోంగార్డ్స్ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. వీరి సేవలు ప్రశంసనీయమన్నారు. నేరాలను అరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటున్నారని కొనియాడారు.

News December 6, 2025

చిత్తూరు: అంగన్వాడీలకు నిధులు మంజూరు.!

image

చిత్తూరు జిల్లాలో అంగన్వాడీల మౌలిక వసతులకు రూ.8 కోట్లను మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ శాఖ ద్వారా అమలుచేస్తున్న సంక్షేమ ఫలాలను పేదలకు అందజేయాలని సూచించారు. దీనిపై కలెక్టర్ కార్యాలయంలో నాగార్జున ఐఏఎస్ వీసీలో ఐసీడీఎస్ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. అసంపూర్ణంగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం, తాగునీరు, వసతులు ఏర్పాటు చేస్తామన్నారు.