News July 9, 2024

మదనపల్లెలో రోడ్డు ప్రమాదం.. విద్యార్థులకు తీవ్ర గాయాలు

image

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. ఎస్సై వెంకటసుబ్బయ్య వివరాల ప్రకారం.. స్థానిక నీరుగట్టువారిపల్లె ఎస్టీ హాస్టల్ విద్యార్థులు ముగ్గురు బైక్‌పై చంద్ర కాలనీ వద్దకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కాలనీ వద్ద వారి బైకు అదుపుతప్పి కింద పడ్డారు. క్షతగాత్రల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వారు తెలిపారు.

Similar News

News February 25, 2026

చిత్తూరు: విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన!

image

చిత్తూరు జిల్లాలో ఓ టీచర్‌పై కేసు నమోదైంది. పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టర్ టీచర్‌గా వెంకటేశ్‌ పనిచేస్తున్నారు. ఓ విద్యార్థిని పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించగా తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

News February 25, 2026

చిత్తూరు: పన్ను వసూళ్ల గడువు పెంపు

image

గ్రామ పంచాయతీల్లో పన్ను వసూళ్ల గడువును మార్చి 15వ తేదీ వరకు పొడిగించినట్లు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల డీపీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు జిల్లా పరిధిలో రూ.27.41 కోట్ల పన్ను వసూలు లక్ష్యంలో ఇప్పటివరకు రూ.18.63 కోట్లు(68 శాతం) వసూలైనట్లు డీపీవో సుధాకర్ రావు తెలిపారు. డీఎల్డీవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

News February 24, 2026

చిత్తూరు- తిరుపతి హైవేపై ప్రమాదం

image

పూతలపట్టు మండలం వడ్డేపల్లి వద్ద ఓ వ్యక్తిని టెంపో వాహనం ఢీకొట్టింది. స్థానిక బిడారమిట్టకు చెందిన టి చెంగయ్య వడ్డేపల్లి వద్ద ఓ కళ్యాణమండపంలో జరుగుతున్న తమ సమీప బంధువు వివాహానికి హాజరు కావడానికి వెళ్లాడు. ఈ క్రమంలో బస్సు దిగి రోడ్డు దాటుతుండగా టెంపో వాహనం చెంగయ్యను ఢీకొని రెండు కాళ్లపై మీదుగా వెళ్లింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.