News April 16, 2025
మదనపల్లె: ఉచ్చులో చిక్కుకున్న చిరుత పులి

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నూటి పాలెం వద్ద రైతులు వన్య ప్రాణుల నుంచి పంట రక్షణకు పొలాల చుట్టూ అమర్చిన ఉచ్చులో మంగళవారం రాత్రి ఓ చిరుత పులి చిక్కుకుంది. ఉదయాన్నే గమనించిన రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి సమీపంలోకి చిరుత రావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రైతులు భయాందోళన చెందుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News September 17, 2025
సిద్దిపేట: చిరుత సంచారంపై క్లారిటీ

గౌరవెల్లిలో చిరుత సంచరిస్తుందంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో అటవీశాఖ అధికారులు స్పందించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సిద్ధార్థరెడ్డి బృందం రైతు జక్కుల రాజు వ్యవసాయ పొలాన్ని పరిశీలించింది. అక్కడి కాలి ముద్రలు హైనా లేదా జాకబ్ జంతువులవిగా గుర్తించారు. ఆ జంతువుల్లో కొన్ని పులిని పోలి ఉంటాయని, చిరుత పంజా చాలా పెద్దగా ఉంటుందని అధికారులు వివరించారు.
News September 17, 2025
భూమనకు తిరుపతి నేలపై నడిచే అర్హత లేదు: మంత్రి స్వామి

AP: తిరుమల విషయంలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని మంత్రి DBV స్వామి అభిప్రాయపడ్డారు. YCP నేత భూమనకు శ్రీవిష్ణువు, శని దేవుని విగ్రహానికి తేడా తెలియదా అని నిలదీశారు. ఆయనకు తిరుపతి నేలపై నడిచే అర్హత లేదని ధ్వజమెత్తారు. వేంకన్న పాదాలు పట్టుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమలపై YCP నేతలు నిత్యం విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేంకన్నతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవన్నారు.
News September 17, 2025
శ్రీకాకుళం జిల్లాలో భారీగా పడిపోయిన బంతి పూల ధరలు

శ్రీకాకుళం జిల్లాలో బంతి పూల ధరలు భారీగా పడిపోయాయి. గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వినాయక చవితి సమయంలో కిలో రూ.50-60 పలకగా ఆ తర్వాత ధర క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీకి రూ.20 కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కిలోకు రూ. 35-40 వరకూ వస్తే పెట్టుబడులైనా దక్కుతాయని అంటున్నారు. రాబోయే దసరా సీజన్ పైనే బంతిపూల రైతులు ఆశలు పెట్టుకున్నారు.