News March 4, 2025
మదనపల్లె: ఉద్యోగం పేరుతో మోసపోయిన అమ్మాయిలు

ఉద్యోగం పేరుతో ముగ్గురు అమ్మాయిలు మోసపోయిన ఘటన మదనపల్లెలో జరిగింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి(M)కి చెందిన ముగ్గురు అమ్మాయిలు డిగ్రీ చదివారు. వారికి మదనపల్లెలోని ఓ ప్రైవేట్ కంపెనీ జాబ్ ఆఫర్ చేసింది. రూ.18వేలు జీతం అని మాయమాటలు చెప్పారు. ఉద్యోగంలో చేరాలంటే రూ.45వేలు కట్టాలనడంతో నిర్వాహకులకు డబ్బులు చెల్లించారు. తీరా వారు జాబ్లో చేరిన తరువాత మోసపోయామని గ్రహించడంతో పోలీసులను ఆశ్రయించారు.
Similar News
News March 5, 2025
VJA: బంగారు నగల కోసం హత్య.. జీవిత ఖైదు

నగలు కోసం వృద్ధురాలిని హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. గుణదలకు చెందిన ఓ వృద్ధురాలిని 2014లో హత్య చేసి బంగారం చోరీ చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు తోట్లవల్లూరుకు చెందిన బుజ్జి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయగా విజయవాడ న్యాయస్థానం జైలు శిక్ష, రూ.3వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నాగేశ్వరావు తీర్పు చెప్పారు.
News March 5, 2025
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన అక్కడ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ఇవాళ రాత్రి తిరిగి వైజాగ్ చేరుకుంటారు. రేపు ఉదయం తన తోడల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొంటారు. మళ్లీ 6వ తేదీ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్తారు. 7న ఢిల్లీ నుంచి తిరిగి అమరావతి చేరుకుంటారు.
News March 5, 2025
అంగన్వాడీ కేంద్రాలకు నిధుల మంజూరు

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రూ.3.08 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను అంగన్వాడీలలో సీమంతం, అన్నప్రాశన, తదితర కార్యక్రమాలకు వినియోగిస్తారు. అనంత జిల్లాలో 2,303 కేంద్రాలకు రూ.1.38 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2,824 కేంద్రాలకు 1.70 కోట్లు నిధులు కేటాయించారు. దీంతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.