News May 3, 2024
మదనపల్లె: ఉరి వేసుకుని సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
మదనపల్లె మండలంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జరిగింది. వేంపల్లి గ్రామంలోని సతీశ్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం బెంగళూరు నుంచి ఇంటికి వచ్చిన సతీశ్ నేడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్యతో విడాకులు తీసుకోవడం, తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News November 5, 2024
చిత్తూరు: వ్యవసాయ పరపతి సంఘాల బలోపేతానికి చర్యలు చేపట్టండి
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలో జాయింట్ వర్కింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఛైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గల 3,60,000 మంది రైతులలో 1.90 లక్షల మంది మాత్రమే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు.
News November 5, 2024
9న తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 9న పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. 8వ తేదీ రాత్రి 8 నుంచి 9:00గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున మధ్యాహ్నం 1 నుంచి 5:00గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ మాడ వీధుల్లో శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
News November 5, 2024
PTM యువకుడు బెంగళూరులో ఆత్మహత్య
బెంగళూరులోని ఓ యాప్‌లో చేసిన అప్పులు తీర్చలేక వేధింపులకు గురై PTM మండలానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి వెలుగుచూసిన ఘటనపై వివరాలు.. పీటీఎం(మం), రాపూరివాండ్లపల్లెకు చెందిన శివశ్యాం ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవారు. స్నేహితుడికి సాయం చేయడానికి యాప్లో లోను తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించలేకపోవడంతో వారి వేధింపులు అధికమై ఆత్మహత్యచేసుకుని మృతి చెందాడని బంధువులు తెలిపారు.