News May 11, 2024
మదనపల్లె టమోటా మార్కెట్‌కు రెండు రోజులు సెలవు

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మదనపల్లె టమోటా మార్కెట్‌కు ఆర్ఓ హరిప్రసాద్ 2రోజులు సెలవు ప్రకటించారు. మదనపల్లెలో ఎన్నికలు 13న జరగనున్న నేపథ్యంలో ఐదు పోలింగ్ కేంద్రాలు నీరుగట్టువారిపల్లెలో ఉన్నాయి. దీంతో మదనపల్లె టమోటా మార్కెట్ యాడ్‌ను ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం సాయంత్రం 7గంటల వరకు ఎలక్షన్ ఆఫీసర్ల అధీనంలో ఉంటుంది. ఆది, సోమవారాలు టమోటా రైతులు మార్కెట్‌కు టమోటాలు తీసుకురావద్దని కోరారు.
Similar News
News December 4, 2025
చిత్తూరు జిల్లా అధికారులను అభినందించిన పవన్ కళ్యాణ్

చిత్తూరు పర్యటనలో DyCM పవన్ కళ్యాణ్ చెప్పిన సూచనలను అధికారులు పూర్తిగా పాటించారు. బోకేలు, శాలువాలు, ఫ్రూట్ బాస్కెట్లు ఇవ్వడం లాంటివి ఎవరూ చేయలేదు. ఇవన్నీ ఉద్యోగులకూ, ప్రభుత్వ నిధులకూ భారం అవుతాయని, అలాంటి మర్యాదలు వద్దని పవన్ కళ్యాణ్ ముందే పలుమార్లు సూచించారు. ఈ నియమాన్ని విధేయంగా అమలు చేసినందుకు అధికారులను ఆయన అభినందించారు. పార్టీ నేతలకూ ఇలాంటి ఖర్చులను సేవా కార్యక్రమాలకు మళ్లించాలని సూచించారు.
News December 4, 2025
చిత్తూరు: టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్స్ నియమిస్తామని డీఈవో వరలక్ష్మి చెప్పారు. జిల్లాలో 34 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 5వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేలు జీతం ఉంటుందన్నారు.
News December 4, 2025
చిత్తూరు జిల్లాలో CIల బదిలీ

చిత్తూరు జిల్లాలో ముగ్గురు సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పలమనేరు అర్బన్ సీఐ కె.మురళీమోహన్ను స్పెషల్ బ్రాంచ్ సీఐగా బదిలీ చేశారు. పూతలపట్టు అర్బన్ సీఐ కృష్ణ మోహన్‌ను వీఆర్‌కు పంపారు. చిత్తూరులో వీఆర్‌లో ఉన్న డి.గోపిని పూతలపట్టు అర్బన్ సీఐగా నియమించారు.


